గోరంట్ల మాధవ్ వీడియో రియల్-అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక బయటపెట్టిన టీడీపీ

ఏపీలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ప్రాధమిక విచారణ జరిపిన అనంతపురం పోలీసులు ఇది రియల్ కాదని తేల్చేశారు. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి కూడా దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఆలోపే టీడీపీ అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు దీన్ని పంపింది. ఆ నివేదిక ఇవాళ బయటపెట్టింది.

 గోరంట్ల మాధవ్ వీడియో రియల్

గోరంట్ల మాధవ్ వీడియో రియల్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించి వైరల్ అవుతున్న నగ్న వీడియో రియల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇది నిజమా కాదా తేల్చాల్సింది ఫోరెన్సిక్ నిపుణులు కాదా పోలీసులు ఎలా తేలుస్తారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ డీజీపీతో పాటు లోక్ సభ స్పీకర్ ను కూడా కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇది రియల్ అని నిర్ధారించేలా ఓ ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటికి వచ్చింది.

 యూఎస్ ఎక్లిప్స్ ల్యాబ్ రిపోర్ట్

యూఎస్ ఎక్లిప్స్ ల్యాబ్ రిపోర్ట్

అమెరికాకు చెందిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను పరిశీలించింది. ఈ వీడియోను అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసింది. దాన్ని టీడీపీ నేతలు ఇవాళ బయటపెట్టారు. ఇందులో పలు అంశాల్ని ల్యాబ్ ప్రస్తావించింది. ఎస్పీ ఫకీరప్ప చెప్పిన విషయాలకు పొంతన లేకుండా ఈ ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. ఈ నివేదిక ఇప్పుడు వైసీపీని ఇరుకునపెట్టేలా ఉంది. దీంతో టీడీపీ దీన్నివైరల్ చేసే పనిలో ఉంది.

 ఫోరెన్సిక్ నివేదికలో ఏముంది ?

ఫోరెన్సిక్ నివేదికలో ఏముంది ?

ఎక్లిప్స్ ల్యాబ్ విడుదల చేసిన రిపోర్ట్ లో ఆగస్టు 9న తమ వద్దకు ఈ వీడియో వచ్చిందని తెలిపింది. పోతిని అనే వ్యక్తి తమకు పరీక్షల కోసం దీన్ని పంపారని వెల్లడించింది. అలాగే ఇది మార్ఫింగ్ చేశారా లేక ఒరిజినలేనా తేల్చాలని కోరినట్లు తెలిపింది. అయితే ఎస్పీ ఫకీరప్ప చెప్పినట్లుగానే ఈ వీడియో ఫోన్ లో రికార్డింగ్ చేశారని తేల్చారు. అయితే తమకున్న అనుభవం, పరిజ్ఞానం ఆధారంగా చూస్తే.. రికార్డ్ చేసిన ఈ వీడియో నిజమేనని, ఇది ఎడిట్ చేసింది కాదని తెలిపింది. దీంతో ఈ రిపోర్ట్ పై వైసీపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Recommended Video

    జగన్ ను గద్దె దించాలి అంటే అందరూ కలిసి రావాల్సిందే....*Political | Telugu OneIndia

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+