అసెంబ్లీ వదిలేస్తే 2 లోకసభ: బిజెపికి టిడిపి ప్రతిపాదన
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తు కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం భేటీ అయి చర్చిస్తున్నారు. మూడు గంటలుగా వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఈ చర్చలో టిడిపి కొత్త ప్రతిపాదన తెర పైకి తీసుకు వచ్చిందని సమాచారం. బలహీన బిజెపి అభ్యర్థులతో మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న చంద్రబాబు తాజాగా ఇరువురికి ఆమోదయోగ్య ప్రతిపాదన అవుతుందంటూ బిజెపి ముందు ఉంచారట. సీమాంధ్ర ప్రాంతంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వదిలేస్తే బిజెపికి అదనంగా మరో రెండు లోకసభ స్థానాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు.

లోకేష్ పూజలు
అనంతపురం జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో టిడిపి నేత నారా లోకేష్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ సమక్షంలో పలువురు అడ్వకేట్లు టిడిపిలో చేరారు.
పీలేరులో కిరణ్ నామినేషన్
జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. శనివారం ఆయన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో కిరణ్ పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications