Nara Lokesh : లోకేష్ పాదయాత్రకు అనుమతి కోరిన టీడీపీ-జీవో నంబర్ 1 వేళ ఉత్కంఠ !
టీడీపీ యువ నేత నారా లోకేష్ ఈ నెల 27న చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ ఇవాళ డీజీపీకి లేఖ రాసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. అలాగే లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉన్నందున పటిష్ట భద్రత కావాలని కూడా కోరారు.
ఈ నెల 27 నుంచి నారా లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు అనుమతి కోరుతూ ఇవాళ డీజీపీకి టీడీపీ నేత నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఇందులో పాదయాత్రకు అనుమతితో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వర్ల కోరారు. లేఖను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా జత చేశారు. లోకేష్ వ్యక్తిగత కార్యదర్శి నరేష్ పాదయాత్రకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటారని లేఖలో వర్ల పేర్కొన్నారు. లోకేష్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల సైతం కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఇందులో ప్రస్తావించారు.

రాజకీయ వ్యతిరేకులు, ఫ్యాక్షనిస్టుల నుంచి లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఈ లేఖలో వర్ల డీజీపీకి తెలిపారు. ఈ నేపధ్యంలో లోకేష్ పాదయాత్రకు, రాత్రిళ్ల బసకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు.
భద్రతా ఏర్పాట్లు చూసుకునేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం రోడ్లపై యాత్రలు, ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం నేపథ్యంలో లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications