రాజీనామాపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెనక్కి ? చంద్రబాబుతో భేటీ-అసంతృప్తిపై వివరణ

ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా అధిష్టానంపై అలిగారు. రాజీనామాకు సిద్దపడ్డారు. అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని అలిగిన బుచ్చయ్య తన అసంతృప్తికి గల కారణాల్ని ఇప్పటికే తనను కలిసిన ఇతర సీనియర్లతో పంచుకున్నారు. అయితే రాజీనామా ప్లాన్ పై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు దీంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారన్న సంకేతాలు అందుతున్నాయి. ఇవాళ మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన ఆయన.. పార్టీ అదినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.

 చంద్రబాబుపై గోరంట్ల అలక

చంద్రబాబుపై గోరంట్ల అలక

టీడీపీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా పార్టీ అధిష్టానంపై అలిగారు. అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ తనను లెక్క చేయడం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. ఇక ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ రాజీనామా చేసేస్తానని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హుటాహుటిన పార్టీ నేతలు ఆయన్ను కలిసి అసంతృప్తికి గల కారణాల్ని తెలుసుకున్నారు. మధ్యలో ఓసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా గోరంట్లతో ఫోన్ లో మాట్లాడారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు.

 చంద్రబాబుతో గోరంట్ల భేటీ

చంద్రబాబుతో గోరంట్ల భేటీ

పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు తన మాటకు విలువివ్వడం లేదన్న కారణంతో అసంతృప్తిగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అధిష్టానం చర్చలకు ఆహ్వానించింది. దీంతో ఇవాళ ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. అక్కడే అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన అసంతృప్తికి గల కారణాలను వివరించారు. పార్టీ సీనియర్ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ ఆయనతో పాటే వచ్చారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఇటీవల తన మాటకు విలువ ఇవ్వకుండా అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాల్ని గోరంట్ల చంద్రబాబుతో పంచుకున్నారు. దీంతో గోరంట్ల చెప్పిన మాటల్ని చంద్రబాబు కూడా సావధానంగా విన్నట్లు తెలుస్తోంది.

 గోరంట్లకు ఇచ్చే హామీలపై ఉత్కంఠ

గోరంట్లకు ఇచ్చే హామీలపై ఉత్కంఠ

టీడీపీ అధిష్టానంపై అలిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఏం హామీలు ఇవ్వబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గోరంట్ల ప్రస్తుతం మరో నేత పయ్యావుల కేశవ్ చేపట్టిన పీఏసీ ఛైర్మన్ పై ఆశలు పెట్టుకున్నారనే ప్రచారం సాగుతోంది. పయ్యావుల కేశవ్ పదవీకాలం త్వరలో ముగిసిపోనుంది. దీంతో ఆ తర్వాత ఆ పదవి తనకు ఇవ్వాలని గోరంట్ల కోరుతున్నారు. అదే సమయంలో త్వరలో జరిగే రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక, ఇతర వ్యవహారాల్లో తన మాట చెల్లుబాటయ్యేలా చూడాలని కూడా గోరంట్ల కోరుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అంశాలపై చంద్రబాబు ఆయనకు హామీ ఇస్తారా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.

Recommended Video

    Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Oneindia Telugu
     రాజీనామాపై వెనక్కి తగ్గిన గోరంట్ల

    రాజీనామాపై వెనక్కి తగ్గిన గోరంట్ల

    పార్టీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదంటూ అలిగిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇప్పుడు తన రాజీనామామా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది అసంతృప్తి బయటపెట్టిన తొలిరోజు రాజీనామాపై వ్యాఖ్యలు చేసిన గోరంట్ల కొన్ని రోజులుగా దీనిపై మౌనంగానే ఉంటున్నారు. అధిష్టానం సూచనతో రాజీనామాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇప్పుడు అధిష్టానంతో భేటీ నేపథ్యంలో రాజీనామా ప్రతిపాదన విరమించుకునేందుకు గోరంట్ల సిద్ధమయ్యారు. దీంతో గతంలో ప్రకటించిన రాజీనామా ప్లాన్ ను గోరంట్ల వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీలతో రాజీనామాపై గోరంట్ల వెనక్కి తగ్గినట్లు సమాచారం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+