టీడీపీ సీనియర్ల అత్యవసర భేటీ-చంద్రబాబు బెయిల్, ఫీడ్ బ్యాక్ పై చర్చ ?
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు ఇవాళ టీడీపీ సీనియర్లు అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీ సీనియర్ నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చంద్రబాబుకు బెయిల్ తెప్పించే అంశంతో పాటు తాజా పరిణామాలపై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందన్న దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో పార్టీ సీనియర్లు ఇవాళ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ప్రతిభాభారతి, కళా వెంకట్రావు, అనగాని సత్యప్రసాద్, పంచుమర్తి అనురాధ, షరీఫ్ తో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టు తర్వాత జనాల్లో వచ్చిన స్పందన, ఇవాళ బంద్ కు లభిస్తున్న స్పందనపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపైనా వీరు చర్చించారు.

చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో లోకేష్ తో పాటు ఆయన కుటుంబం రాజమండ్రిలోనే ఉండి భోజనం, ఇతర ఏర్పాట్లను చూసుకుంటోంది. అలాగే లోకేష్ పాదయాత్ర కూడా అర్ధాంతరంగా నిలిపేయాల్సి వచ్చింది. మరోవైపు బంద్ సందర్భంగా పార్టీ నేతలు ఎక్కడికక్కడే ఉండి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిల్ రాకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంతో పాటు పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా జనంలోకి వెళ్లి చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు వాడుకోవడంపై నేతలు చర్చిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రజా వ్యతిరేకత నుంచి జనాల దృష్టి మళ్లించేందుకే వైసీపీ సర్కార్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications