టీడీపీ జాబితాలో లేని సిట్టింగ్ లు, సీనియర్లు - చంద్రబాబు లెక్క ఏంటి..!!
టీడీపీ - జనసేన అభ్యర్దుల జాబితా ప్రకటించారు. టీడీపీ నుంచి 94, జనసేన నుంచి 5 స్థానాల్లో అభ్యర్దుల జాబితా విడుదల చేసారు. మొత్తం 175 స్థానాల్లో జనసేనకు 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు.
టీడీపీకి 151 స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే టీడీపీ సీట్లు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. అయితే, టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో కొందరు సిట్టింగ్ లతో సహా పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు. దీంతో..వీరి విషయంలో చంద్రబాబు ఆలోచన ఏంటనేది సస్పెన్స్ గా మారుతోంది.

టీడీపీ జాబితా ప్రకటన : తెలుగుదేశం అధినేత చంద్రబాబు 94 మందితో పోటీ చేసే అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించారు. అందులో 23 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తుతో ఈ లిస్టు కూర్పు చేసినట్లు వెల్లడించారు. మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లను కొందరిని పక్కన పెట్టారు. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదన పైన ఆయన విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తు కుదిరితే బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో..గంటాకు సీటు ఖరారు చేయలేదని తెలుస్తోంది.
సీనియర్లకు దక్కని ఛాన్స్ : పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు గురించి కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు జాబితాలో ఈ నియోజకవర్గంకు అభ్యర్దిని ఖరారు చేయలేదు. బుచ్చయ్య తో పాటుగా కందుల దుర్గేష్ కు సర్దుబాటు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు సీటు కేటాయించారు. దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఆయన సీటు దక్కదని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ జాబితాలో స్థానం ఇవ్వలేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంత క్రిష్ణ ప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీటు ఇస్తారని తెలుస్తోంది.

మార్పులు - చేర్పులు : ఉమాను పెనమలూరుకు మార్చే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నా..అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదేనని స్పష్టం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ ముఖ్య నేతగా ఉన్న యరపతినేని కి జాబితాతో అవకాశం దక్కలేదు. అక్కడ వైసీపీ నేత జంగా క్రిష్ణమూర్తి ఈ నెల 26న టీడీపీలో చేరనున్నారు. జంగాకు గురజాల, నర్సరావుపేటలో ఒక స్థానం కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది.
దీంతో, ఇప్పుడు యరపతినేని స్థానం పెండింగ్ లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తరువాత ఈ ఇద్దరి స్థానాలు ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక, టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి పార్ధసారధి పేరు ఖరారైంది. తొలి జాబితాలో స్థానం దక్కని సీనియర్లు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications