బియ్యపానంద బాబా.. ఆ షాకింగ్ వీడియోతో వైసీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరును తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తుంటే, తెలుగుదేశం పార్టీ నేతలు చేసే పనులను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇక ఏకంగా వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రచ్చ చేస్తున్న పరిస్థితి ఉంది.

కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని టార్గెట్ చేసిన టీడీపీ

తాజాగా కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ని టార్గెట్ చేసిన టీడీపీ బియ్యపానంద బాబా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ వీడియోను పోస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ వైసిపి ఎమ్మెల్యే తీరును ఆ వీడియో ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేసింది. వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన వద్దకు వచ్చే వారితో శాలువాలు కప్పించుకుని, కాళ్ళకి దండాలు పెట్టించుకుంటున్నాడు అంటూ టార్గెట్ చేసిన టీడీపీ, ఈ శాలువాలు కప్పించుకోవడం, కాళ్ళకు దండాలు పెట్టించుకోవడం చూసి ఆయనేదో బాబా అనుకునేరు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అని పేర్కొంది.

సన్మానాలు, కాళ్ళకి దండాలు ... వీడియో తో టార్గెట్

సన్మానాలు, కాళ్ళకి దండాలు ... వీడియో తో టార్గెట్

ఏమిటిదంతా అంటే... అదంతే! మళ్ళీ అధికారంలోకి వచ్చేదే లే అని గట్టిగా నమ్మే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా తమ ముచ్చట్లు గబగబా తీర్చేసుకుంటున్నారు. అందరితో కాళ్ళకి దండాలు పెట్టించుకోవాలని, సన్మానాలు చేయించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు తగ్గ కోరికలు ఉన్నాయని, మళ్లీ గెలిచేది లేదు కాబట్టి ఆ కోరికలు ఇప్పుడు తీర్చుకుంటున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేసింది. ఇక వీడియో చూసిన వాళ్ళు శాలువాలు కప్పించుకుంటూ, కాళ్లకు మొక్కించుకుంటున్న ఎమ్మెల్యే తీరు చూసి తెగ నవ్వుకుంటున్నారు.

వైసీపీ నేతల వీడియో లను పోస్ట్ చేసి పరువు తీస్తున్న టీడీపీ

వైసీపీ నేతల వీడియో లను పోస్ట్ చేసి పరువు తీస్తున్న టీడీపీ

ఒక్క బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రమే కాదు వైసీపీ నేతలు, ఎవరు ఏ కార్యక్రమం చేసినా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న టిడిపి, వారి చేసే పనిలో తప్పులు వెతుకుతూ టార్గెట్ చేస్తుంది. ఇంతకుముందు గడపగడపకు కార్యక్రమంలో దేవినేని అవినాష్ ను మహిళలు నిలదీసిన వీడియోను పోస్ట్ చేసి దేవినేని అవినాష్ పై టిడిపి సెటైర్ వేసింది. గడపగడపకు మన ప్రభుత్వం కాస్తా... గడపగడపకు గాలి తీసుడు కార్యక్రమం అయిపోయింది అంటూ టీడీపీ వ్యాఖ్యానించింది. వైసీపీ నేత దేవినేని అవినాష్ ను మహిళలు ఎలా తుస్సుమనిపించారో చూడండి అంటూ వీడియోను పోస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. అంతకు ముందు ఏపీ ఉప ముఖ్యమంత్రికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైన వీడియోను షేర్ చేసి ఇది వైసీపీ పాలన అంటూ చెప్పే ప్రయత్నం చేసింది టిడిపి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+