మాచర్లలో పిన్నెల్లి అరాచకం.. వైసీపీ గూండాల గొడ్డలి దాడి... ఆ వీడియోలతో ఏకిపారేస్తున్న టీడీపీ

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఎన్నికల పోలింగ్ నాడు ఈవీఎంల ధ్వంసం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల పోలింగ్ నాడు పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక ఇప్పటికే టీడీపీ నేతలు ఏపీలో దాడులకు, హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే కారణమని అనేకసార్లు ఆరోపించారు.

వైసీపీ దాడులపై టీడీపీ పోస్ట్
ఇక తాజాగా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను ప్రజలందరికీ తెలిసేలా వీడియో పోస్ట్ చేసిన టిడిపి తాజాగా, వైసీపీ నాయకుల తీరు ఏ విధంగా ఉంటుందో.. రాష్ట్రంలో విధ్వంసాలను వైసిపి నాయకులు ఏ విధంగా సృష్టించారో తెలియజేసే ప్రయత్నం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సందర్భంలో అక్కడే ఉన్న టిడిపి పోలింగ్ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

TDP targets Macharla MLA Pinnelli Ramakrishna Reddy and ycp rowdyism with those videos

పిన్నెల్లిని అడ్డుకున్న టీడీపీ పోలింగ్ ఏజెంట్ పై గొడ్డలితో దాడి
పోలింగ్ బూత్ వద్ద ఒక మహిళ కూడా పిన్నెల్లి నిలదీసింది. దీంతో వారు వారిపై దాడి చేశారని టిడిపి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే, పిన్నెల్లికి ఎదురెళ్ళి అడ్డుకున్నారని టిడిపి పోలింగ్ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు గారి పైన వైసిపి గుండాలు గొడ్డలితో దాడి చేశారని పేర్కొంది. ఇది వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయం అని మండిపడింది.

ప్రశ్నించిన మహిళపై బూతులతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే పిన్నెల్లి
తాను పోరాడుతుంది ఒక రాక్షస జాతితో అని తెలిసి కూడా, టిడిపి జెండా కోసం ధైర్యంగా నిలబడ్డారు నంబూరి శేషగిరిరావు గారు. ఇలాంటి కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ ఆస్తి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అంతేకాదు పోలింగ్ బూత్ లో ఈవీఎం పగలగొట్టి వెళ్తున్న సమయంలో... తనను అడ్డగించి ప్రశ్నించిన మహిళ పై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

పోరాడిన ప్రతీ టీడీపీ కార్యకర్తకు పాదాభివందనం అంటూ పోస్ట్
మొన్నటి ఎన్నికల్లో జగన్ రెడ్డి సైకో గ్యాంగ్ అరాచకాన్ని, దౌర్జన్యాన్ని, గూండాయిజాన్ని ఎదుర్కొని మరీ, ఎన్నికల్లో పోరాడిన ప్రతి ఒక్క టిడిపి కార్యకర్తకు పాదాభివందనం అంటూ టిడిపి సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఇదే సమయంలో వైసీపీ రాజ్యం రౌడీ రాజ్యం అని మండిపడుతుంది. ఏపీలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత రాష్ట్రం రావణ కాష్టంగా మారటానికి కారణం వైసీపీనే అని చెప్తుంది టీడీపీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+