చెవిరెడ్డిపై అభ్యర్దిని ఖరారు చేసిన చంద్రబాబు - గెలిచేదెవరు..!!
ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. టీడీపీ కూటమి సీట్ల సర్దబాటు పై కసరత్తు చేస్తోంది. పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీ కి 8 ఎంపీ - 30 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. జనసేన ఇప్పటికే 6 స్థానాల్లో తమ అభ్యర్దులను ప్రకటించింది. సీట్ల సంఖ్య పైన అంగీకారినికి వచ్చినా.. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనేది ఈ రోజు స్పష్టత రానుంది. ఈ సమయంలోనే ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ది ఎవరనేది క్లారిటీ వచ్చింది.
టీడీపీ తమ తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది. పొత్తుల్లో రెండు పార్టీలకు కేటాయించిన సీట్లు మినహాయిస్తే 51 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ రోజు లేదా రేపు అభ్యర్దుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. బీజేపీకి కేటాయించే ఆరు స్థానాల పైన సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. జనసేన కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయం అయింది. బీజేపీకి కేటాయించిన సీట్లను మినహాయించి టీడీపీ పోటీ ఖాయమైన స్థానాల్లో అభ్యర్దుల ఎంపిక పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకటి రెండు రోజుల్లోనే తమ అభ్యర్దులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ది పైన నిర్ణయం జరిగింది. వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీలో చేరటానికి నిర్ణయించారు. కానీ, వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్దంగా లేరు. తన స్థానంలో తన కుమారుడు రాఘవరెడ్డికి ఒంగోలు సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్దిగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి పోటీలో ఉన్నారు. రాజకీయంగా తాను విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయడం శుభపరిమాణంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. అయితే, ప్రతీ సీటు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న చంద్రబాబు మాగుంట రాఘువరెడ్డి విషయంలో అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications