TDP Twitter Account : టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్- వైసీపీ పనేనంటూ ఆరోపణలు ?
టీడీపీ ట్విట్టర్ ఖాతా ఇవాళ హ్యాక్ అయింది. కొందరు హ్యాకర్లు టీడీపీ ఖాతాను హ్యాక్ చేసి మరో పేరు పెట్టేశారు. టైలర్ హాబ్స్ పేరుతో టీడీపీ ట్విట్టర్ ఖాతాను మార్చేశారు. ఖాతా పేరు కింద మాత్రం ఐటీడీపీ పేరును అలాగే ఉంచారు. దీంతో ఈ వ్యవహారం ఏపీలో ఆసక్తి రేపుతోంది.
టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను ఇవాళ కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ డిజిటల్ విభాగం ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది. హ్యాక్ అయిన తర్వాత ట్విట్టర్ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా ఇతర పోస్టులు కనిపిస్తున్నాయి. అలాగే డిస్ క్రిప్షన్ కూడా మార్చేశారు. దీంతో రెగ్యులర్ గా టీడీపీ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనిపై ట్విట్టర్ వేదికగానే పోస్టులు పెడుతున్నారు. టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే తొలిసారి కాదు. నాలుగు నెలల క్రితం కూడా ఓసారి ఇలాగే జరిగింది. ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించారు.

మరోవైపు తమ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురి కావడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టైలర్ హాబ్స్ పేరుతో తమ పార్టీ ట్విట్టర్ ఖాతాను మార్చివేయడం వెనుక వైసీపీ సానుభూతిపరుల హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. అయితే దీన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ట్విట్టర్ ఖాతా మారిపోవడంతో దాన్ని వాడి హ్యాకర్లు ఎలాంటి పోస్టులు పెడతారో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ ఎలాంటి నష్టం జరగలేదని, నిపుణుల సాయంతో దీన్ని పునరుద్దరిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications