కొట్టుకున్న టిడిపి-జగన్ పార్టీ: కాంగ్ ఘర్షణలో గాయాలు

TDP and YSRCP clash in Prakasam
గుంటూరు/ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘర్షణ అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. టిడిపి పార్టీ నాయకుడు కరణం బలరామ కృష్ణమూర్తి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గొట్టిపాటి రవి కుమార్ తమ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు అద్దంకిలోని కార్యాలయాలకు చేరారు.

గొట్టిపాటి తన కార్యాలయంలో కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, కరణం బలరాం శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో పూజలు నిర్వహించి తిరిగి అద్దంకి చేరుకునే సమయంలో ఈఘటన జరిగింది. వందలాది మంది కార్యకర్తలతో శింగరకొండ నుండి అద్దంకి పట్టణంలోని టిడిపి శ్రేణులు ర్యాలీగా వస్తుండగా, పట్టణంలోని పోతురాజుగండి వద్ద ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది.

అలా చెలరేగిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ర్యాలీగా వస్తున్న టిడిపి శ్రేణులు తమ కార్యకర్తలను జగన్ పార్టీ వారు కొడుతున్నారని రంగంలోకి దిగారు. పోతురాజుగండి వద్ద జగన్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వందలాది కార్యకర్తలు కూడా రావడంతో చిలికి చిలికి గాలి వానలా తయారైంది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు కర్రలతో కొట్టుకుంటూ, రాళ్లు విసురుకున్నారు.

అక్కడే ఉన్న కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ బాబు ఆగ్రహంతో ఊగిపోయారు. సమాచారం అందుకున్న సిఐ బాలసుందర రావు తమ సిబ్బందితో హుటాహుటిన వచ్చి ఇరువర్గాలను శాంతింప చేసేందుకు కృషి చేశారు. ఎంత ప్రయత్నించినా కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఒంగోలు నుండి స్పెషల్ పార్టీ పోలీసులను రప్పించారు. ఒంగోలు నుండి వచ్చిన పోలీసు బలగాల సహకారంతో ఇరువర్గాలను దూరంగా తరిమివేశారు.

అనంతరం తమ కార్యకర్తలపై దాడి చేశారని, ఫ్లెక్సీలు చించేశారని, వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గొట్టిపాటి రవి కుమార్ రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. ఆ సమయంలో మరో మారు ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

గుంటూరు జిల్లాలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. జిల్లాలోని క్రోసూరు మండలం నగవరం గ్రామంలో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది టిడిపి, ఆరుగురు కాంగ్రెసు కార్యకర్తలు గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+