టీచర్ దారుణం: అమ్మాయిని దగ్గరకు తీసుకొని..

Teacher misbehave with 9th class student
అనంతపురం: ఓ విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు వికృత చేష్టలు ప్రదర్శించాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. తన వద్ద చదువుకుంటున్న ఓ విద్యార్థిని పైన ఉపాధ్యాయుడు కన్నేశాడు. చదువు చెప్పే నెపంతో దగ్గరకు తీసుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయిని 9వ తరగతి చదువుతోంది.

ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ టీచర్ వికృత చేష్టలకు భయాందోళనకు గురైన ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లడం మానేసింది. విషయం తెలియడంతో పరువు కాపాడుకునేందుకు ఉపాధ్యాయుడు పాట్లు పడుతున్నాడని తెలుస్తోంది. పోలీసు కేసు కాకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడంటున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా వారితోను కాళ్లబేరానికి దిగాడని సమాచారం.

వివాహిత హత్య కేసులో నిందితుల అరెస్టు

ఉరవకొండ పోలీస్ సర్కిల్ పరిధిలోని డోనేకల్లు గ్రామానికి చెందిన వివాహిత కురబ సిద్ధమ్మ (28)ను హత్య చేసి కాల్చిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఉరవకొండ సీఐ ఎలమరాజు తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

డొనేకల్లు గ్రామానికి చెందిన సిద్ధమ్మ అక్టోబర్ 12వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి గాదిలింగప్ప 31వ తేదీ విడపనకల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే అక్టోబర్ 11వ తేదీ సిద్ధమ్మ, ఆమె భర్త లక్ష్మిరెడ్డి గొడవ పడ్డారని, దీంతో ఆమె అదే రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు.

తిరిగి ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త లక్ష్మిరెడ్డి, ఆమె తమ్ముడు శివలింగ ఆమె కోసం కలిసి గాలించారు. సిద్ధమ్మకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.

ఈ నేపథ్యంలో గ్రామ శివారు ప్రాంతంలో కనిపించిన సిద్ధమ్మకు లక్ష్మిరెడ్డి, శివలింగ మాయమాటలు చెప్పి కర్నూలు జిల్లాలోని టి.సాకిబండ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చివేశారు. సంఘటనా స్థలంలో సేకరించిన ఎముకలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నామని, హత్య కేసులోని నిందితులు లక్ష్మీరెడ్డి, శివలింగలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+