మోసం: సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని పరారీ

సంస్థ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. యజమాని గురువారంనాడు పరారయ్యాడు. హైదరాబాదులోని సోమాజిగుడాలో శంతన్ కృష్ణన్ అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం డెస్ట్రీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అనే సంస్థను స్థాపించాడు.
అతను 130 మంది ఉద్యోగుల నుంచి 30 వేల నుంచి లక్ష రూపాయలకు ఒక్కొక్కరి నుంచి వసూలు చేశాడు. గత నాలుగు నెలలుగా అతను వారికి వేతనాలు చెల్లించడం లేదు. ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో వదిలేసి అతను పారిపోయాడు. ఈ విషయాన్ని పంజగుట్ట పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎస్ మోహన్ కుమార్ చెప్పారు.
బాధితులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చెన్నైకి చెందిన కృష్ణన్ హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్‌లో ఉంటున్నాడు. చాలా మంది బాధితులు బిటెక్, ఎంసిఎ విద్యార్థులు.












Click it and Unblock the Notifications