విషాద ఘటన: గదిలో ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం - కర్నూలుకు చెందిన ఈశ్వర్యయ విజయవాడ జైలు డిప్యూటీ సూపరింటిండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు సి. ప్రవీణ్ కమార్ (24) కరీంనగర్‌లో బిటెక్ చదివి, హైదరాబాద్‌లో ఎంటెక్ చేశారు. ఆ తర్వాత క్యాంపస్ సెలెక్షన్‌లో ఎంపికై గత అక్టోబర్ 31వ తేదీన సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా విధుల్లో చేరాడు
గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లోని హాస్టల్లో ఉంటూ కార్యాలయానికి వెళ్లి వచ్చేవాడు. అయితే, శుక్రవారం ఉదయం 8 గంటలకు తన రూమ్మేట్, సహోద్యోగి అయిన ప్రసన్నతో కలిసి టిఫిన్ చేశాడు. తర్వాత డ్యూటీకి వస్తానని చెప్పి, ప్రసన్నను పంపేసి హాస్టల్‌లో ఉండిపోయాడు.
ప్రవీణ్ కుమార్ ఆఫీసుకు రాకపోవడంతో లంచ్ సమయంలో ప్రసన్న వచ్చి చూడగా హాస్టల్ గదికి లోపిలి నించి గడియ పెట్టి ఉంది. హాస్టల్ నిర్వాహకుడి సమాచారం మేరకు పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా, ప్రవీణ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. ఇటీవల కంపెనీ నిర్వహించిన పరీక్షలో అతను ఫెయిలైనట్లు తెలుస్తోదంి. దాంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కాగా, ప్రవీణ్ సోదరి ప్రసన్నకుమారి మెడిసిన్ చదువుతూ ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఆ బాధతో పాటు కంపెనీ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications