హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ రేప్‌కేసులో ఎన్ఐఏ హెల్ప్, చెమటోడ్చిన పోలీస్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Techie rape: NIA helped cops
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సంచలనం రేపిన టెక్కీ అత్యాచారం కేసులో నగర పోలీసులకు జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) సహకరించింది. ఓ ప్రయివేటు పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సిసి కెమెరా దృశ్యాలు పోలీసులకు ఉపయోగపడిన విషయం తెలిసిందే. ఈ సిసి కెమెరాలోని దృశ్యాలు అస్పష్టంగా ఉన్నాయి. దీంతో పోలీసులు వాటిని నిర్ధారణ కోసం ఎన్ఐఏకు పంపించారు. ఎన్ఐఏ సహాయంతో సిసి కెమరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

కాగా సైబరాబాద్ ఐటి కారిడార్ ప్రాంతంలో భద్రత డొల్లతనం వెల్లడైంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నలభై నాలుగు సిసి కెమెరాల్లో నాణ్యత ఉత్తిదేనని తేలింది. అంతేకాకుండా ఔటర్ రింగు రోడ్డు పైన గల టోల్ టాక్సుల వద్ద ఏ ఒక్క చోటా సిసి కెమెరా పని చేయడం లేదు.

50 వేల లైసెన్సులు, 77 వోల్వో కార్లను వెరిఫై చేసిన పోలీసులు

టెక్కీ అత్యాచారం కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు యాభై వేల లైసెన్సులు చెక్ చేశారు. అంతేకాదు 77 వోల్వో కార్లను వెరఫై చేశారు. రాష్ట్రంలో 77 వోల్వో కార్లు అమ్ముడయ్యాయి. అందులో 44 ప్రయివేటు వాళ్లు కొన్నారు. 33 కార్లను క్యాబ్‌లో నడుస్తున్నాయి.

అందులో ఆరు వోల్వో కార్లు ఒక క్యాబ్ వారికి చెందినవిగా గుర్తించారు. వాటిలో ఐదు కార్లు క్యాబ్ ఆఫీసులోనే ఘటన జరిగిన రాత్రి ఉన్నాయి. ఈ ఆరో కారులోనే నిందితులు బాధితురాలిని తీసుకు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కారును ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన మేనేజర్‌కు లీజుకు ఇవ్వగా ఆ కారుకు సతీష్ డ్రైవర్‌గా ఉన్నాడు. ఘటన జరిగిన రోజు మేనేజర్ నగరంలో లేరు. డ్రైవర్ సతీష్ ఈ కేసులో నిందితుడు.

English summary
Since the CCTV footage of the car was too blurred for a positive identification, it was sent to the NIA for clarification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X