సరదా కోసం వెళితే విషాదం : సూర్యలంక బీచ్ లో టెకీ గల్లంతు

Subscribe to Oneindia Telugu

బాపట్ల : సరదా కోసం బీచ్ కు వెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. విషాదమై మిగిలిపోయాడు. భారీ అలల తాకిడికి సముద్రంలో గల్లంతయిన అతను అనంతరం శవమై తేలాడు. బాపట్లకు సమీపంలోని సూర్యలంక బీచ్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

బాపట్ల సబ్ ఇన్ స్పెక్టర్ శివరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. పుణేలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోన్న బోరుగడ్డ అనిల్ రాజ్ అనే వ్యక్తి రెండు రోజుల సెలవు నిమిత్తం అమృతలూరు మండలంలోని స్వగ్రామమైన యలవర్రుకు వచ్చాడు. ఇదే క్రమంలో స్నేహితులతో కలిసి సరాదాగా గడిపేందుకు సూర్యలంక బీచ్ కు వెళ్లాడు అనిల్.

Techie swept away at suryalanka beach

అయితే సముద్రంలో భారీ అలలు పోటెత్తడంతో.. అలల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యాడు అనిల్. అనంతరం మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు ఎంతగా వెతికినా అనిల్ ఆచూకీ దొరకలేదు. కాగా, గురువారం నాడు కొంతమంది చేపలు పట్టే వ్యక్తులు సముద్రంలో ఓ మృత దేహం తేలుతుండడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహం అనిల్ దిగా గుర్తించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A software engineer was swept away by high tides when he went for a swim at suryalanka beach on wednesday. the body of borugadda anilraj was found on thursday

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి