వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డెడ్ లైన్.. !

ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల చర్చ ఏదో విధంగా జరుగుతూనే ఉంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ ఈసీ నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలో వారంతా రాజీనామాల బాట పట్టారు. వైసీపీ ఒత్తిడితో వీరిలో దాదాపు 65 వేల మంది వరకూ రాజీనామాలు చేసి పార్టీ ప్రచారంలో నేరుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మిగిలిన వారితో కూడా ఎలాగోలా రాజీనామాలు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఒకరు వారికి వార్నింగ్ ఇచ్చారు.

వాలంటీర్లు వెంటనే రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలోకి రావాలని టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ సూచించారు. వైసీపీ కండువా వేసుకుని రాజీనామా చేసి తాను చెప్పిన విధంగా నడుచుకునే వాలంటీర్లు మాత్రమే కొనసాగుతారని , ఇప్పటీ వరకు రాజీనామా చెయ్యకుండా,పార్టీ కండువా వేసుకోకుండా ఉండే వాలంటీర్ ఉంటే ఇకపై వారు తమ పార్టీ కోసం పనిచేయరని తేల్చేశారు.

tekkalai ysrcp mla candidate duvvada srinivas put may 3 deadline for volunteers resignation

టెక్కలి నియోజకవర్గంలో వాలంటీర్లకు మే 3 వరకూ గడువు ఇస్తున్నామని, ఆలోపు వారు రాజీనామాలు సమర్పించి పార్టీ ప్రచారంలోకి వచ్చేయాలని దువ్వాడ శ్రీనివాస్ సూచించారు. లేకపోతే వారు మే 5 తర్వాత వాలంటీర్లుగా ఉండబోరని హెచ్చరించారు.

అలాగే రాజీనామా చెయ్యని వాలంటీర్ తమకు అక్కర్లేదని, వారి స్ధానంలో మరొకరిని నియమిస్తామని కూడా తేల్చిచెప్పేశారు. ఈ పదిరోజులు ఎన్నికల్లో ఎవడు పని చేస్తే వాడే తిరిగి ఎన్నికలయ్యాక వాలంటీర్ గా ఉంటారన్నారు.దీంతో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+