టీవి9, ఆంధ్రజ్యోతిపై చర్యలు స్పీకర్, చైర్మన్‌లకే

అందుబాటులో ఉన్న చట్టాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్‌ను, శాసనమండలి చైర్మన్‌ను కోరారు. టీవీ9, ఆంధ్రజ్యోతి మీడియాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ9ను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతికూలంగా చూపించే ప్రయత్నాలను ఆంధ్రజ్యోతి చేస్తోందని, పని కట్టుకుని విషం చిమ్ముతోందని ఆయన విమర్శించారు. ఆ రెండు సంస్థలపై చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు.
అసెంబ్లీలో తెలంగాణ శాసన సభ్యులు కూర్చుంటే.. టూరింగ్ సినిమాలో కూర్చున్న వారిని మల్టీప్లెక్స్‌లో కూర్చుండబెట్టినట్లు ఉందని చెబుతున్నారని, పాచికల్లు తాగిన మొహాలని అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సభ్యులను అవమానించేందుకు ఇంత అహంకారమా అన్నారు. కొన్ని ఆంధ్రా పత్రికలు కూడా తెలంగాణ ప్రభుత్వం పైన విషం కక్కుతున్నాయని, అందులో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దిన పత్రిక అన్నారు.












Click it and Unblock the Notifications