టిపై మాటిచ్చాం: షిండే, సిఎంపై కెటిఆర్ హక్కుల నోటీస్

కాగా, బిల్లు పైన ఆంధ్రప్రదేశ్ శాసన సభలో చర్చకు రాష్ట్రపతి వారం రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. బిల్లుపై గడువు పెంచే అంశంపై గురువారం ఢిల్లీలో జోరుగా చర్చలు జరిగాయి. బిల్లుపైన గడువు పెంచినట్లు వచ్చిన వార్తలను రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి.
అంతకుముందు షిండే, రాష్ట్రపతి భేటీలో గడువుపై తర్జన భర్జన సాగినట్లుగా వార్తలు వచ్చాయి. నెల రోజుల గడువు పెంచడం కష్ట సాధ్యమని షిండే చెప్పారు. అనంతరం రాష్ట్రపతి వారం రోజుల పాటు గడువు పెంచారు.
ఫిబ్రవరి 5వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో నాలుగు వారాలు అంటే నెల రోజుల పాటు గడువు పెంపు కుదరదని కేంద్రం, కాంగ్రెసు వర్గాలు చెప్పాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ ముసాయిదా బిల్లును పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఎన్నికల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని బలంగా నిర్ణయించుకున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల గడువుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
కిరణ్‌పై సభా హక్కుల ఉల్లంఘన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై కిరణ్ మాట మార్చారని, ఇందుకు చర్యలు తీసుకోవాలని కెటి రామారావు కోరారు.












Click it and Unblock the Notifications