సర్వేపై దుష్టప్రచారం, ఇబ్బంది పెట్టడానికి కాదు: కెసిఆర్

హైదరాబాద్: దళితులకు మూడు ఎకరాల భూమి పథకానికి ఈ గోల్కొండ కోట నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం గోల్కొండ కోటలు జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. గోల్కండ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.

Telangana CM K Chandrasekhar Rao hoists National flag

మహాత్ముడి అడుగుజాడల్లో శాంతియుత పద్ధతిలో, అహింసా మార్గంలో పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకున్నారని, తెలంగాణ ప్రజలు ఈ స్థితిలో ఎంతో ఆనందపడుతున్నారని ఆయన అన్నారుతెలంగాణ ప్రజలకు కెసిఆర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనాడే అంతర్జాతీయ ఖ్యాతిని గోల్కొండ కోట పొందిందని ఆయన అన్నారు. బోనాల పండుగ గోల్కొండ కోట నుంచే ప్రారంభమై గోల్కొండ కోటలోనే ముగుస్తుందని ఆయన గుర్తు చేశారు.

అంతకు ముందు కెసిఆర్ సికింద్రాబాదులోని పరేడ్‌గ్రౌండ్స్‌లో సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కెసిఆర్ చెప్పారు. తమ ప్రభుత్వం ప్రకటించిన, అమలు చేస్తున్న పథకాల గురించి ఆయన వివరించారు. సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించి, క్రీడాకారులను ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు. బలహీన వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. క్

దసరా పండుగ నుంచి ఆడపిల్లలకు 50 వేల రూపాయల చొప్పున ఇచ్చే పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. రైతులకు లక్ష రూపాయల మేరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, 18 వేల కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తుందని, ఈ ప్రయోజనం రైతులకు త్వరలోనే అందుతుందని ఆయన అన్నారు. మన గ్రామం మన ప్రణాళిక, మన మండలం మన ప్రణాళిక, మన జిల్లా మన ప్రణాళిక పథకం ద్వారా రాష్ట్ర ప్రణాళిక రూపు దిద్దుకుంటుందని ఆయన చెప్పారు.

దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని, నైజాం రాజులు మనకు ఇచ్చిన భూములు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. పది లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనువుగా ఉన్నట్లు గుర్తించామని, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. సింగిల్ విండో ద్వారా పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుని పోతామని చెప్పారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్స్ నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. కల్లు దుకాణాలను హైదరాబాదులో దసరా పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో హరితహారం పేరిట ఓ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని, అర్హులకే ప్రయోజనం చేకూర్చడానికి, నిధులు అక్రమ మార్గం పట్టకుండా చూడడానికే సమగ్ర సర్వే చేపట్టామని ఆయన అన్నారు. ఈ విషయంలో దుష్టశక్తులు రాద్దాంతం చేస్తున్నాయని, ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని, ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు.

తెలంగాణకు డ్రింకింగ్ గ్రిడ్ త్వరలోనే ప్రజల ముందుకు వస్తుందని ఆయన అన్నారు. ప్రజలే కేంద్రంగా, అభివృద్ధి పథంలో నడిపించడానికి వ్యూహాలను, పథకాలను రూపొందించి అమలు చేస్తామని ఆయన చెప్పారు. మేధావులు, ప్రజల సూచనలతో పథకాలను, వ్యూహాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+