తెలంగాణ తొలి ప్రధాన కార్యదర్శి చందనాఖాన్?

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు మహిళకు దక్కవచ్చనే ప్రచారం తెరాస ముఖ్యుల్లో జరుగుతోంది. సీనియారిటీ జాబితా ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రేసులో చందనాఖన్ అందరికంటే ముందు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆమె 1979 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఏపీ కేడర్ అధికారి. ఆ తర్వాత స్థానంలో 1980 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఏపీ కేడర్ అధికారి లక్ష్మీపార్థసారథి ఉన్నారు.
ఆమె హైదరాబాదీ. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేసినప్పటికీ, తెలంగాణ తొలి సీఎస్ పదవి మహిళ చేపట్టిన రికార్డు నిలిచిపోతుంది. ఆరు నెలల సర్వీసు మాత్రమే ఉన్న చందనాఖన్‌ను సీఎస్‌గా నియమించుకొని, ఆ తర్వాత తమకు ఇష్టమైన వారిని సీఎస్‌గా పెట్టుకోవచ్చనే భావన తెరాస ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర తొలి సీఎస్‌గా చందనాఖన్ పేరు ఖరారు కావచ్చని తెలుస్తోంది.
డిజిపి పదవికి టీపీ దాస్, ఎస్ఏ హుదా, అనురాగ్‌శర్మ పేర్లు కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో టీపీ దాస్ నవంబర్, 2015లో, హుదా జూలై, 2017లో రిటైర్ అవుతున్నారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన వారే. ప్రతి పోస్టుకు ఒకే ఒక్క పేరుతో ప్రతిపాదనలు పంపాలని కేంద్రం కోరటంతో తెలంగాణ డిజిపిగా టీపీ దాస్ నియామకం వైపు కెసిఆర్ మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications