పోలీసు శాఖలో కొలువుల జాతర - ఒకే సారి 14 వేల పోస్టుల భర్తీ, నోటిఫికేషన్..!!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దాదాపు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల భర్తీకి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దమైంది. దాదాపు రెండేళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు నూతన సంవత్సర గిఫ్ట్ కింద ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది.

తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీసు శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్‌ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్‌ కానిస్టేబుళ్లతో పాటు ఇతర యూనిఫామ్‌ సర్వీసుల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు.

Telangana Police Recruitment board to release notification for 14000 posts soon

నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే పోలీసు రిక్రూట్‌మెంట్లు జరిగాయి. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.

కాగా, 2023 నుంచి ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో జాప్యం అవుతోన్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంద న్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీసు శాఖలో ఏటా జరుగుతున్న పదవీ విరమణల వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుళ్ల భర్తీ జరగకపోవ డంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి.

మిగిలిన సిబ్బందిపై పనిభారం ఎక్కువ అవు తోంది. ఈపోస్టులను రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్‌ అవుతుందని, ఆలస్యం అయ్యేకొద్దీ మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని భావిస్తున్నారు. అయితే, లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న తరుణంలో డీజీపీ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+