ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు: హామీ ఉంటేనే అనుమతి

నల్గొండ: ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

కరోనా రోగులతో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా రోగులకు తెలంగాణలోకి అనుమతి లేదంటున్నారు. అంతేగాక, హైదరాబాద్‌లో పడకలు, ఆక్సిజన్ లేవని పోలీసులు చెబుతున్నారు.

ఈ క్రమంలో పుల్లూరు టోల్‌గేటు వద్దకు కర్నూలు పోలీసులు చేరుకుని తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. దీంతో ఆస్పత్రుల హామీ ఉన్న అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మిగితా వాహనాలను తనిఖీ చేసి యధావిధిగా విడిచిపెడుతున్నారు.

అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చే అంబులెన్స్ లను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే, హైదరాబాద్‌లో చికిత్స పొందుతన్న కరోనా రోగుల్లో సగం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో స్వరాష్ట్రంలోని రోగులకు బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అంబులెన్స్‌లను అడ్డుకోవడం బాధాకరమంటూ ఏపీ బీజేపీ నేత

ఏపీ నుంచి వచ్చే కరోనా రోగులను తెలంగాణలోకి అనుమతించకపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలని కోరారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీ నుంచి వచ్చే కరోనా అంబులెన్స్‌లను రెండు రాష్ట్రాల సరిహద్దులో ఆపేసి తెలంగాణ పోలీసులు వెనక్కి పంపడం బాధాకరమని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రులను కోరారు.

Telangana police stopped andhra pradesh covid ambulances at state border

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోసారి రాష్ట్రంలో 20వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా నమోదైన 22,164 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 92 మంది మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరంలో 11 మంది, విశాఖపట్నంలో 10 మంది, తూర్పుగోదావరిలో 9 మంది, పశ్చిమగోదావరిలో 8 మంది, నెల్లూరులో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 8707కి చేరింది.

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 18,832 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,88,264కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,90,632 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,73,67,935 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2844 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా ప్రకాశంలో 980 మంది కరోనా బారినపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+