జగన్ పై ప్రశంసలు..కేసీఆర్ పై విమర్శలు : టీఆర్‌ఎస్‌ కు సంకటంగా మారుతున్న వైసీపీ..!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సరి కొత్త పరిణామాలకు కారణమవుతోంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం కారణంగా తెలంగాణలోనూ అదే డిమాండ్ మొదలైంది. అది ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు వర్సెస్ ప్రభుత్వంగా మారింది. ఇప్పటి వరకు ప్రతిపక్షాల మీద ప్రభుత్వం అన్ని స్థాయిలోనూ పై చేయి సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ సమ్మె ద్వారా సీఎం కేసీఆర్‌ పైన రాజకీయంగా యుద్దం ప్రకటించ టానికి ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటవుతున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇదే సమయంలో ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని..ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసిస్తున్న తెలంగాణ రాజకీయ నేతలు..తెలంగాణ ప్రభుత్వం..ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆర్టీసీ నేతలు నిర్వహించిన అఖిలపక్షానికి మాత్రం వైసీపీకి ఆహ్వానం లేదు. హాజరు కాలేదు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసల పైన తెలంగాణ అధికార పార్టీ నేతలు మాత్రం స్పందించటం లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఆర్‌ఎస్‌ కు సంకటంగా మారుతోంది.

 జగన్ పై ప్రశంసలు..కేసీఆర్ పై విమర్శలు

జగన్ పై ప్రశంసలు..కేసీఆర్ పై విమర్శలు

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్టీసీ సమ్మె విషయంలో స్పందిస్తున్న తీరు ను తప్పుబడుతున్న పార్టీల నేతలు అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వారు ఇంతగా అభినందిస్తున్న వైసీపీ నేతలను మాత్రం ఆహ్వానించలేదు. వైసీపీ నేతలు సైతం హాజరు కాలేదు. కార్మిక సంఘాల నేతలు సైతం ముఖ్యమంత్రి ఆర్టీసీ పరిస్థితిని ఇతర రాష్ట్రాలతో కాదని..ఏపీతో పోల్చాలని సూచిస్తున్నారు. దీని పైన తెలంగాణ అధికార పార్టీ నేతలు మాత్రం మాట్లాడేందుకు ముందుకు రావటం లేదు.

జగన్ ను చూసి నేర్చుకోవాలి..

జగన్ ను చూసి నేర్చుకోవాలి..

ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్‌ వైఖరిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల వింటే నవ్వు వస్తోందని.. గతంలో ఆయన చేసిన వాగ్దానాలు మరోసారి గుర్తుచేసుకోవాలని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను చూసి కేసీఆర్‌ ఎంతో కొంత నేర్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె విరుద్ధమని కేసీఆర్‌ ఎలా అంటారని ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సీపీఐ, టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సమయంలో ఆర్టీసీ సమ్మె ప్రకటన రాలేదని చెప్పారు.ఆర్టీసీ కార్మికుల తొలంగిపు ప్రకటనను కేసీఆర్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌ మద్దతుపై సీపీఐ పునరాలోచన చేస్తోందని తెలిపారు.కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి నేర్చుకోవాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సూచించారు.

వైసీపీతో టీఆర్‌ఎస్‌ కు సంకటం...

వైసీపీతో టీఆర్‌ఎస్‌ కు సంకటం...

తెలంగాణ విపక్ష పార్టీలు మూకుమ్ముడిగా ఆర్టీసీ సమ్ము విషయంలో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం చేసింది మీరు ఎందుకు చేయలేకపోతన్నారని ప్రశ్నిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని సమర్ధించలేదక..అదే సమయంలో కేసీఆర్.. జగన్ మధ్య ఉన్న సంబంధాల కారణంగా వ్యతిరేకించలేక సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా కమిటీ ఏర్పాటు చేసారు. అయితే సాంకేతిక అభ్యంతరాల కారణంగా తొలుత ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంలోని ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు, దీని పైన తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ నిర్ణయం పైన ఏరకంగా స్పందిచాలనే దాని పైన తర్జన భర్జన పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+