''పవిత్రా నరేష్'' గా మారిన పవిత్రా లోకేష్

తాము పెళ్లి చేసుకోబోతున్నామంటూ నరేష్, పవిత్రా లోకేష్ జనవరి 1న ప్రకటించారు.

కరోనా తర్వాత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలిచిన అంశం ఏదైనా ఉందా? అంటే అది నరేష్-పవిత్రాలోకేష్ మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే. కొత్త సంవత్సరం సందర్భంగా తాము వివాహం చేసుకోబుతున్నామని నరేష్-పవిత్రా లోకేష్ జనవరి 1వ తేదీన ప్రకటించారు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఇది ఒక సంచలన విషయంగా మారింది. తన పెళ్లికి సంబంధించిన వీడియోను నరేష్ ట్విట్టర్ లో ఉంచారు. పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులు.. మీ
ఆశీస్సులు కోరుకుంటూ మీ పవిత్రా నరేష్ అని ట్వీట్ చేశారు.

ఎటువంటి ఆర్భాటం లేకుండా కేవలం సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగినట్లుగా వీడియోను బట్టి అర్థమవుతోంది. కలిసి సినిమాలు చేసే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. జనవరి 1వ తేదీన తమ ప్రేమ విషయాన్ని ఈ జంట బహిరంగంగా వెల్లడించింది.

telugu actor naresh and actress pavitra lokesh doing marriage

నరేష్ మూడో భార్య రమ్య.. తాను విడాకులివ్వనంటూ వీరిద్దరూ బెంగళూరులోని ఒక హోటల్ లో ఉన్నప్పుడు రాద్ధాంతం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నరేష్, పవిత్రా లోకేష్ విషయం హాట్ టాపిక్ గా మారింది. కొన్నిరోజులపాటు వీరి గురించే పెద్ద చర్చ నడిచింది. తాము ఒకటవబోతున్నామంటూ షాకిచ్చిన వీళ్లిద్దరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

telugu actor naresh and actress pavitra lokesh doing marriage

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+