జగ్గంపేటలో ఆ మహిళ ఇచ్చిందే చంద్రబాబుకు ఆయుధమైంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఈనెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అమరావతిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ కూడా సామాన్లను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించింది. స్థలాన్ని పర్యవేక్షించి ఆదేశాలు వచ్చిన వెంటనే ఏర్పాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏ ఫైలు సంతకం చేస్తారనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది.
మహిళ ఇచ్చిన పెన్నుతో
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించారు. జగ్గంపేటలో ఓ మహిళ తనకు పెన్నును కానుకగా ఇచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంపై ఆ పెన్నుతోనే తొలి సంతకం చేయాలని ఆమె కోరినట్లుచంద్రబాబు తెలిపారు. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. దీంతో చంద్రబాబు తొలి సంతకం ఆ ఫైలు పైనే చేస్తారని కూటమి నేతలు భావిస్తున్నారు.

కీలకం కానున్న చంద్రబాబు
ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సంచలన విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ 135, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను, బీజేపీ 10 స్థానాలకు 8 స్థానాల్లో ఘన విజయాన్ని నమోదు చేశాయి. అధికార పార్టీ వైసీపీ కేవలం 11 స్థానాలకు కుదేలైంది. లోక్ సభ నియోజకవర్గాలు మొత్తం 25 ఉంటే తెలుగుదేశం పార్టీ 16, జనసేన 2, బీజేపీ 3 స్థానాల్లో జయకేతనం ఎగరవేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలను దక్కించుకుంది. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి గా నరేంద్రమోడీ ఈనెల ఎనిమిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీయే కూటమిలో ప్రధానంగా ఉన్న బీజేపీకి అధికారం సాధించేందుకు అవసరమైన 272 మెజారిటీ సీట్లను సాధించలేకపోయింది. కేవలం 240 దగ్గర ఆగిపోయింది. దీంతో కూటమిలో చంద్రబాబు, జేడీయూ నితీష్ కుమార్ కీలకం కానున్నారు.












Click it and Unblock the Notifications