వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశం పార్టీ కొత్త ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌?

|
Google Oneindia TeluguNews

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావ‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తోంది. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. న‌వంబ‌రులో ప్రారంభించాల‌ని పార్టీ అనుకున్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం ముంద‌స్తును కొంత వాయిదా వేయ‌డంతో టీడీపీ కూడా లోకేష్ పాద‌యాత్ర‌ను జ‌న‌వ‌రికి వాయిదా వేసింది. జ‌న‌వ‌రి 26వ తేదీన ప్రారంభ‌మ‌య్యే యాత్ర సుదీర్ఘంగా సాగి ఎన్నిక‌ల స‌మ‌యానికి ముగిసేలా ప్ర‌ణాళిక ర‌చించారు.

 అమ్ముల పొదిలో అస్త్రాలను బయటకు తీస్తున్న చంద్రబాబు

అమ్ముల పొదిలో అస్త్రాలను బయటకు తీస్తున్న చంద్రబాబు

పాద‌యాత్ర ప‌క్కాగా విజ‌య‌వంత‌మ‌య్యేలా పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న అమ్ముల‌పొదిలోని అస్త్రాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర కొన‌సాగేలా ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తున్నారు. కుప్పంలో ప్రారంభ‌మై ఇచ్చాపురంలో ముగిసే అవ‌కాశం ఉంది. అయితే ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలనేది పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రజల నుంచి యాత్రకు మంచి స్పందన లభించేలా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. లోకేష్ పాదయాత్ర నిత్యం వార్త‌ల్లో నానేలా చంద్ర‌బాబే తగు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఏ వ్యూహకర్తపై ఆధారపడకుండా ప్ర‌ణాళిక‌లు కూడా త‌న సొంతానివే అమ‌లు చేస్తున్నారు.

 విజయ దశమి తర్వాత నుంచి సమావేశం

విజయ దశమి తర్వాత నుంచి సమావేశం


ద‌స‌రా ప‌ర్వ‌దినం త‌ర్వాత‌రోజు నుంచి పార్టీ వీరాభిమానులతో చంద్ర‌బాబు స‌మావేశ‌మ‌వ‌బోతున్నారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యి మందికి త‌క్కువ కాకుండా హాజ‌ర‌వ‌బోతున్నారు. పార్టీలో దీర్ఘ‌కాలం నుంచి కొన‌సాగుతున్న‌వారిని కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడ‌నున్నారు. స్వ‌యంగా చంద్ర‌బాబే వీరితో భేటీ అవుతారు. దాదాపు 450 రోజులు యాత్ర కొన‌సాగే అవ‌కాశం ఉంది.

చంద్రబాబు వ్యూహరచన

చంద్రబాబు వ్యూహరచన


పాదయాత్ర ప్రారంభ రోజుల్లో మీడియా కూడా కవరేజ్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంది. కానీ సుదీర్ఘంగా 450 రోజుల కవరేజ్ అంటే ఎవరికీ సాధ్యపడదు. కానీ ఈ 450 రోజులు లోకేష్ పాదయాత్ర ప్రజల్లో నానాలంటే తీవ్ర కసరత్తులు చేయాల్సిందే. అందుకే నియోజకవర్గానికి వెయ్యిమందిని ఎంపిక చేయబోతున్నారు. వీరందరికీ ఆయా నియోజకవర్గాల్లో వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు స్థానిక నాయకులు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఈ వెయ్యిమంది తమతోపాటు తమ బంధువులను, స్నేహితులను కూడా భాగస్వాములను చేయబోతున్నారు. అందరూ కలిసి పాదం మోపేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఏదేమన్నా కానీ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ ఎంత సీరియస్ గా అమలు చేయబోతోందో దీన్నిబట్టే అర్థమవుతోంది.

English summary
Party chief Chandrababu is taking out the arrows in his quiver to make the padayatra a success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X