• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవ్ యూ రాజా.. ఎక్కడున్నావ్ రాజా..??

|
Google Oneindia TeluguNews

పోసాని కృష్ణమురళి. రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి క్యారెక్టర్ నటుడిగా స్థిరపడ్డారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసే సమయంలో తనదగ్గర ఉన్న ప్రతిభా పాటవాలతో మంచి రచయితగా పేరు తెచ్చుకోవడంతోపాటు సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు వేస్తున్నారు. కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇటువంటి తరుణంలోనే ఏపీ అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడంతోపాటు ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.

నామినేటెడ్ కూడా దక్కలేదు

నామినేటెడ్ కూడా దక్కలేదు

తనకు పునాది వేసిన కలం బలంకన్నా నటుడిగానే ఎక్కువగా రాణిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళికి నామినేటెడ్ పదవి దక్కుతుందనుకున్నారు. కొంత కాలం గడిచిన తర్వాత పోసానికి ఎఫ్ డీసీ చైర్మన్ పదవిని ఇవ్వబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తింది. అయితే ఇంతవరకు ఆయన ఏ పదవినీ అధిరోహించలేదు. సినిమాల్లో కూడా కనిపించడం మానేశారు.

ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమిపాలు

ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమిపాలు


గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ తరఫున ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడి ఓటమి పాలయ్యారు. ఇటీవల రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వ పరిపాలనపై, జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. అప్పటికే చిత్రసీమకు, ప్రభుత్వానికి థియేటర్లలో టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించి వివాదం ప్రారంభమైంది. తనను దృష్టిలో పెట్టుకొనే ధరలను ప్రభుత్వం తగ్గించిందని, కావాలంటే తన సినిమాలకు తగ్గించుకోమని సవాల్ విసిరారు. ఇతర సినిమాలను ఈ వివాదంలోకి లాగవద్దన్నారు.

రంగంలోకి దిగిన పోసాని

రంగంలోకి దిగిన పోసాని


వైసీపీ తరఫున పోసాని కృష్ణ మురళి రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలను ఎక్కుపెట్టారు. ఒకానొక దశలో పవన్ వ్యక్తిగత విషయాలను కూడా పోసాని ప్రస్తావించారు. ఆ తర్వాత అతను మాట్లాడిన మాటలన్నీ పవన్ వ్యక్తిగతం జీవితంపైనే ఉన్నాయి. ఇంట్లో స్త్రీలను, చిన్నపిల్లలను కూడా వదలకుండా అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. వీటిని రాజకీయ రంగంలోకానీ, సినీ పరిశ్రమలోకానీ ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. అక్కడి నుంచి ప్రారంభమైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. సినీ పరిశ్రమలో కూడా పోసాని కృష్ణమురళిని దాదాపుగా పక్కన పెట్టేశారనే వార్తలు వస్తున్నాయి. నటుడిగా మంచి స్థాయిలో ఉన్న తరుణంలో రాజకీయాల్లోకి ప్రవేశించడం.. పవన్ పై తీవ్రస్థాయిలో చిందులేయడం వెన్వెంటనే జరిగిపోయాయి. అటు పదవి రాలేదు.. ఇటు ఎవరూ సినిమాల్లోకి తీసుకోవడంలేదు. కథా రచయితగా, నటుడిగా మంచి భవిష్యత్తు ఉన్న పోసాని అటు సినీ పరిశ్రమకు, ఇటు రాజకీయ రంగానికి రెండింటికీ చెడ్డ రేవడిలా అయ్యారంటూ తెలుగు పరిశ్రమలో వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

English summary
After YCP comes to power in 2019, Posani Krishnamurali wanted to get the nominated post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X