కష్టాలు తొలిగేలా - గణపతికి ప్రత్యేక పూజలు..!!
రెండు తెలుగు రాష్ట్రాలు వరదల నుంచి కోలుకుంటున్నాయి. వినాయక చవితి పండుగకు సిద్దమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతూనే..మరో వైపు వినాయక చవిత వేడుకలు మొదలయ్యాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు పలువురు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలిచాయి. ఇక...రెండు రాష్ట్రాల్లోనూ వినాయకచవితి పండుగ సందడి నెలకొంది. తొలిపూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు ముస్తాబయ్యాడు.
మొదలైన ఉత్సవాలు
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితీ ప్రతీ ఏటా ప్రత్యేకమే. కష్టాలు..సమస్యలు ఎలా ఉన్నా వినాయక చవిత పండుగ మాత్రం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సారి కూడా వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా వివిధ రూపాల్లో గణనాథుల్ని కొలువుదీర్చారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ వియక చతుర్థి శోభ నెలకొంది. ఆది దేవుడైన గణనాథునికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది.

ఆకట్టుకుంటున్న ప్రతిమలు
పలు రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఖరీదైన లంబోదరుడిని ఏర్పాటు చేశారు. తంజావూరు ఆలయం తరహా సెట్టింగ్ వేశారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అంతరాలయాన్ని అలంకరించారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలువ పందిళ్లలో గణనాథులు కొలువుతీరారు. హైదరాబాద్ లో గణేష్ చతుర్దికి ప్రత్యేకత ఉంది. భారీ సంఖ్యలో గణపతులను వేల మండపాల్లో ప్రతిష్ఠిస్తారు. 11 రోజులు పూజలు అందుకున్న గణనాధులను సాగర తీరం వరకు భారీ ఊరేగింపుతో వెళ్లి నిమజ్జనం చేస్తారు.
శ్రీశైల మహా క్షేత్రంలో
ఇక, ఏపీలోనూ ఈ సారి చవితి ఉత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలు దక్షిణ బజార్‌లో 33 అడుగల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సమతా నగర్‌లో 15 వందల కొబ్బరి కాయలతో 15 అడుగుల ఎత్తులో వినాయకుడ్ని ప్రతిష్టించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రంథాలయం వీధిలో బాహుబలి తరహాలో సెట్టింగ్ వేసి వినాయకచవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీశైల మహా క్షేత్రంలో ఇవాళ్టి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం విద్యుత్ అలంకరణలతో కాంతులీనుతుంది.












Click it and Unblock the Notifications