'అబద్దాలు చెప్తారా, అతనిని జగన్ తాత ఎలా హత్య చేశారో అందరికీ తెలుసు'
బీసీలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు వేరుగా విమర్శించారు.
అమరావతి: బీసీలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు వేరుగా విమర్శించారు.
బీసీ నేత జింకా వెంకటేశ్వర్లును జగన్ తాత ఎలా హత్య చేశారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. జగన్ రోడ్డున పడి అన్ని అబద్దాలు చెబుతున్నారన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా ప్రజా సమస్యలపై టీడీపీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తాము నెరవేరుస్తున్నామని చెప్పారు. టీడీపీ సభ్యులే ప్రశ్నలు వేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సమాధానం రాబడుతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications