చంద్రబాబుతోనే తేల్చుకుంటామని అంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, కొడాలి నాని, పెద్దిరెడ్డికి ?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిందని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చాలా మంది హ్యాపీగానే ఉన్నారు. అయితే కొంత మంది టీడీపీ నాయకులు మాత్రం పోలీసు అధికారుల మీద రగిలిపోతున్నారు. పోలీసు అధికారుల తీరుతో సీఎం చంద్రబాబు దగ్గర తేల్చుకోవాలని, ఇలాగే వదిలేస్తే వైసీపీ భజన చేస్తూ మా మీద ఇంకా కక్ష సాధించే అవకాశం ఉందని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని తెలిసింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ సందర్బంలో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సమీపంలోని అంగళ్లుకు చంద్రబాబు చేరుకున్న సమయంలో గొడవలు జరిగాయి. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలకం రేపింది.

అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ అంగళ్ల గొడవలకు సంబంధించి కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద మాత్రమే కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి తొత్తులా వ్యవహరించారని చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నాయకులు ఆరోపించారు. చాలా మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండు నెలల పాటు మదనపల్లె, కడప జైల్లో కూడా ఉండి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఐపీఎస్ అధికారి గంగాధర్ ను కృష్ణ జిల్లా ఎస్పీగా బదిలి చేశారు. అయితే వైసీపీ నాయకులకు అండగా నిలబడి ఇంతకాలం వాళ్లు చెప్పినట్లు ఆడిన గంగాధర్ కు కృష్ణ జిల్లా ఎస్పీగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారని గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అంటున్నారు. ఇదే విషయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృష్ణ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల ముందు విచారం వ్యక్తం చేశారని తెలిసింది.

అంతేకాకుండా కృష్ణ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గంగాధర్ గుడివాడ చేరుకుని రాత్రంతా మాజీ మంత్రి కొడాలని నానితోనే ఉన్నారని, గతంలో అంగళ్లు కేసులో టీడీపీ నాయకుల మీద హత్యాయత్నం కేసులు పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి స్వామి భక్త ప్రదర్వించారని, ఇప్పుడు కృష్ణ జిల్లాకు వచ్చిరాగానే కొడాలి నాని దగ్గరకు వెళ్లి తాను వైసీపీ వీరవిధేయుడు అని నిరూపించుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే రాము మండిపడుతున్నారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడితో మాట్లాడి వెంటేనే గంగాధర్ ను వేరే జిల్లాకు పంపించాలని రాము అంటున్నారని కృష్ణ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications