టిడిపి కార్యకర్తపై వేటకొడవళ్లతో దాడి: ఖైదీ పరారీ

హైదరాబాద్: కర్నూలు జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. తుగ్గలి మండలం రాంపల్లిలో పొలానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త సుధాకర్‌పై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుధాకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో సుధాకర్‌కు కాంగ్రెస్‌ వర్గీయులకు ఘర్షణ జరిగింది. కాంగ్రెస్‌ వారే ఈ దాడి చేశారని సుధాకర్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Telugudesam party worker Sudhakar has been attacked in Kurnool district.

అనంతపురం జిల్లా ఓపెన్‌ ఎయిర్‌ జైలు నుంచి గురువారం ఖైదీ దస్తగిరి పరారయ్యాడు. అనంతపురం జైలు నుంచి కడప జైలుకు తరలిస్తుండగా పోలీసుల కల్లుగప్పి తప్పించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దస్తగిరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ హత్య కేసులో 11 సంవత్సరాలుగా దస్తగిరి జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, తిరుమల రెండో ఘాట్‌రోడ్డు ఏడో కిలోమీటర్‌ వద్ద గురువారం ఉదయం ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో భక్తులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+