నాకు, నా కుటుంబానికి ప్రాణహాని, రక్షణ కల్పించండి: తెనాలి ఎమ్మెల్యే దాడి బాధితుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలిలో పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లో ఉన్న ఒక ఓటరును తెనాలి ఎమ్మెల్యే కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తెనాలి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్లో రమ్మన్నందుకు ఒక ఓటరు చెంప చెళ్ళుమనిపించగా, ఓటర్ తిరిగి ఎమ్మెల్యే చెంప పగలగొట్టాడు. ఇక ఆపై ఎమ్మెల్యే అనుచరులు సదరు ఓటర్ పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు.

ఓటరుపై తెనాలి అభ్యర్థి దాడి ఘటన
ఇక ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. తెనాలి వైసిపి అభ్యర్థిని అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్ పోలీసులను ఆదేశించింది. ఓటర్ పై దాడి చేసిన ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. తెనాలి పోలింగ్ కేంద్రంలో ఓటర్ పై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయడం వైసిపి ఫ్రస్టేషన్ కు నిదర్శనమని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Tenali mla victim voter asked police protection as he and his family in fear of life threaten

చంద్రబాబు, జనసేన టార్గెట్
ఓటమి ఖాయం కావటంతో వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులు చేస్తున్నారని, ఈ దాడులతో ప్రజలలో వచ్చిన చైతన్యాన్ని, తిరుగుబాటును అణిచి వేయలేరని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇక ఓటరును కొట్టిన తెనాలి వైసిపి ఎమ్మెల్యే శివకుమార్, అతని అనుచరుల అణచివేయాలి అంటే మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన వారిని గెలిపించాలని జనసేన ట్వీట్ చేసింది.

అసభ్యంగా మాట్లాడితే కొట్టాను అన్న ఎమ్మెల్యే అభ్యర్థి
అయితే ఈ ఘటనపై స్పందించిన తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఆ ఓటరు తనను దుర్భాషలాడాడని అందుకే కొట్టాను అన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్న నువ్వు అసలు కమ్మోడివేనా అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడడం తోనే బుద్ధి చెప్పాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని
అయితే తాను ఎమ్మెల్యే పైన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, క్యూలైన్లో రమ్మని చెప్పినందుకే ఎమ్మెల్యే తనపై దారుణంగా దాడి చేశారని బాధితుడు చెబుతున్నాడు. తను కావాలని ఎమ్మెల్యేను కొట్టలేదని, తనపై దాడి చేస్తున్న క్రమంలో, రక్షించుకునే భాగంలోనే తాను కొట్టినట్టు చెప్పారు. ఇప్పుడు ఆ వైసీపీ నేత, అతని అనుచరులు నా కుటుంబ సభ్యులను ఏం చేస్తారో అని భయంగా ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం పోలీసులకు, పౌర సమాజానికి ఉందని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+