బాబు దీక్ష భగ్నం: సోనియా ఫ్లెక్సీ చించివేత, చెప్పులు

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం భగ్నం చేశారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా బాబు దీక్ష చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండే పోలీసులు ఎపి భవన్‌ను చుట్టుముట్టారు. రోడ్లు బ్లాక్ చేశారు. మధ్యాహ్నం ఎపి భవన్‌లోకి వచ్చారు.

ఈ దశలో వేలాదిమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. బాబుకు రక్షణగా నిలబడ్డారు. పోలీసులు ముందుకు రాకుండా అడ్డుకున్నారు. కాంగ్రెసు పార్టీకి, ఆ పార్టీ అధినేత్రిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు మూడు గంటల ప్రాంతంలో కార్యకర్తలను, నేతలను తప్పించి బాబు దీక్షను భగ్నం చేశారు.

chandrababu naidu

అప్పటికే ఎపి భవన్ వద్దకు తీసుకు వచ్చిన అంబులెన్సులోకి చంద్రబాబును ఎక్కించారు. అంబులెన్సు ముందుకు కదలకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని తప్పించి అంబులెన్సు‌ను ముందుకు తరలించారు. బాబు దీక్షను బలవంతంగా భగ్నం చేయడంతో కార్యకర్తలు గో బ్యాక్ పోలీసు అంటూ నినదించారు. దాదాపు గంటపాటు పోలీసులను కార్యకర్తలు నిలువరించారు. బాబును రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

ఎపి భవన్ ప్రాంగణంలో ఉన్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫ్లెక్సీని చించి వేశారు. ఆ ఫ్లెక్సీ పైకి చెప్పులు విసిరారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీని చించివేశారు. అనంతరం వారు సోనియా ఇంటి ముట్టడికి బయలుదేరారు. దీంతో అధినేత్రి ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+