మంగళగిరిలో ఇంకా ఉద్రిక్తత-అన్నక్యాంటీన్ తొలగించిన స్ధానంలో టీడీపీ అన్నదానం

గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్న క్యాంటీన్ కూల్చివేత వ్యవహారం తీవ్ర ఉద్రికతలకు దారి తీస్తోంది. నిన్న టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను స్ధానిక మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ అదే ప్రాంతంలో నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

మంగళగిరిలో అన్న క్యాంటీన్ కూల్చివేసిన ప్రాంతంలో ఉదయం టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టెంట్లు వేసుకుని కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నిన్న టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో..

tension in mangalagiri continues on second day as tdp plans annadanam at anna canteen area

అక్కడే తిరిగి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు మరోసారి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు మంగళగిరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు రూ.2 భోజనం పెడతామని టీడీపీ నేతలు చెప్తున్నారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

tension in mangalagiri continues on second day as tdp plans annadanam at anna canteen area

Recommended Video

    Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat

    అన్నా క్యాంటీన్ ఏర్పాటుకి అంగీకరించేది లేదని మున్సిపల్ సిబ్బంది చెప్తున్నారు. అన్న క్యాంటీన్ ఏర్పాటుకి అడ్డు తగిలితే భారీగా ఉద్యమించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే లక్ష మందితో అన్న క్యాంటీన్ - చలో మంగళగిరి కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. దీంతో మంగళగిరిలో ఉద్రిక్త పరిస్ధితులు తప్పేలా కనిపించడం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+