ఎప్పుడూ రాని బాలకృష్ణ ఇప్పుడు హిందూపురం వచ్చాడంటే..
Nandamuri Balakrishna: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక దీనికి కారణమైంది. ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతోండటం, కౌన్సిలర్లను కాపాడుకోవడానికి రిసార్టు రాజకీయాలకు తెర తీశారు.
మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అక్కడే మకాం వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రిసార్టు రాజకీయాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తోండటం చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లల్లో ఖాళీగా ఉన్న ఛైర్మన్లు, చైర్ పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నేడు జరుగుతోంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల కోసం ఎన్నిక సాగుతోంది.
ఈ పరిణామాల మధ్య హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీలు క్యాంపులను నిర్వహిస్తోన్నారు. ఆయా క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు రెండు పార్టీల కౌన్సిలర్లు. తమ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడింది వైఎస్ఆర్సీపీ. హిందూపురం నియోజకవర్గంలోనే మకాం వేశారు నందమూరి బాలకృష్ణ.
గతంలో హిందూపురం ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఇంద్రజ పార్టీ ఫిరాయించారు. గత ఏడాది ఆగస్టులో ఆమె వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీ కండువా కప్పుకొన్నారు. మొత్తం ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లూ ఆమె వెంట టీడీపీలో చేరారు. ఫలితంగా- ఛైర్‌పర్సన్ ఎంపిక అనివార్యమైంది.
చేరికలతో కలుపుకొని తెలుగుదేశం పార్టీ బలం 23కు చేరుకుంది. వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య 17కు పడిపోయింది. దీనితో ఛైర్‌పర్సన్ కుర్చీ పోరులో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకే అవ్వొచ్చు.












Click it and Unblock the Notifications