పోకిరీల బ్లేడ్ దాడి ట్విస్ట్: పెళ్లి ఇష్టం లేక కట్టుకథ అల్లిన బాలిక

రాజమండ్రి: బుధవారంనాడు 14 ఏళ్ల బాలికపై జరిగిన బ్లేడు దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేక ఆమె బ్లేడుతో కోసుకుని, అగంతకులు దాడి చేసినట్టు కట్టుకథ అల్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తూర్పు గోదావరి జిల్లా వీఆర్‌పురంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని బుధవారం ఉదయం స్కూల్‌కు వెళుతుండగా ఇద్దరు యువకులు బ్లేడ్‌తో దాడి చేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆమె చేతికి గాయం కావడంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినిని విచారించారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గత కొంత కాలంగా తనను ప్రేమించాలని వేధిస్తున్నాడని, అతనే ఈ దాడికి పాల్పడి ఉంటాడని విద్యార్థి పోలీసులకు తెలిపింది. విద్యార్థి చెప్పిన వివరాల ఆధారంగా ఆ యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా అసలు విషయం బయటపడింది.

tenth class girl student gave twist to an attack

పాఠశాలకు వెళ్తున తనపై ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి పదునైన ఆయుధంతో గాయపరిచారని పదోతరగతి అమ్మాయి బుధవారంనాడు చెప్పింది. పట్టి నాగేశ్వరరావు కూతురు ఐశ్వర్య విఆర్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా నాగార్జున గ్రామీణ బ్యాంక్ సమీపంలో ఓ బైక్ తన వద్దకు వచ్చిందని ఐశ్వర్య చెప్పింది.

హెల్మెట్ ధరించిన వ్యక్తి బైక్ నడుపుతుండగా ముఖం కనిపించకుండా ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న మరో వ్యక్తి తన కుడిచేతిపై పదునైన ఆయుధంతో కోశాడని చెప్పిది. తాను షాక్ నుంచి తేరుకుని అరిచే లోపున వారు పారిపోయారని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+