Thalapathy Vijay: రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంట్రీ? ఆ ఎన్నికలే లక్ష్యంగా!!

చాలా కాలంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న దళపతి విజయ్ దాని కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నట్టు కనిపిస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని వ్యూహాలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మేరకు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు.

సినీ హీరో విజయ్.. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరో రజినీకాంత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ దళపతి విజయ్ కు కూడా ఉంటుంది. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు ఆ ముహూర్తం రాలేదు .

 vijaythalapathi-

అయితే ప్రస్తుతం అందుకు తగ్గ గ్రౌండ్ ను విజయ్ సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.ఇటీవల కాలంలో ఆయన సామాజిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడంతో ఈ చర్చ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు విజయ్. ఇప్పటివరకూ దివంగతులైన నేతల జయంతి కార్యక్రమాలను, అనేక ముఖ్య కార్యక్రమాలను తన అభిమానుల ద్వారా చేయిస్తున్నారు.

అంతేకాదు జిల్లాల వారీగా అభిమానులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమాలను విస్తృతంగా చెయ్యటానికి రెడీ అయ్యారు. ఇక ఇటీవల వెలువడిన 10, ప్లస్ 2 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని పిలిపించి వారిని సత్కరించాలని దళపతి విజయ్ నిర్ణయించారు. జూన్ 17వ తేదీన వారిని ఘనంగా సత్కరించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఒక్కొక్క నియోజకవర్గం నుండి ముగ్గురిని ఎంపిక చేసి వారిని ఘనంగా సత్కరించనున్నారు. విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులతోనూ విజయ్ సమావేశం కానున్నారు. అంతేకాదు ఇప్పటికే విజయ్ ఇయక్కంలో జాలర్లు, మహిళలు, విద్యార్ధి విభాగాలను కూడా ఏర్పాటు చేశారు.

ఇలా విజయ్ వేస్తున్న అడుగులను జాగ్రత్తగా గమనిస్తే ఆయన రాజకీయ ఆరంగేట్రం చెయ్యటానికి రెడీ అవుతున్నారని చర్చ జరుగుతుంది. త్వరలోనే అది జరుగుతుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2026 ఎన్నికల లక్ష్యంగా దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీ పక్కా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+