తల్లికి వందనంపై మరో శుభవార్త ... ఆ ప్రభుత్వోద్యోగుల పిల్లలకు కూడా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యా సంవత్సరం ప్రారంభమైన క్రమంలో తల్లికి వందనం పథకం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ పథకం విద్యార్థులకు వర్తిస్తుందని పేర్కొంది.

ఈనెల 22వ తేదీ నాటికి తల్లుల ఖాతాలో తల్లికి వందనం

ఈ పథకానికి 10120.78 కోట్ల రూపాయల చెల్లింపుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ పథకం ద్వారా 67, 47, 190 మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. మొత్తం 42 లక్షల 70 వేల 82 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ కానుంది. ఈనెల 22వ తేదీ నాటికి 64 లక్షల 76 వేల 590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఈ నగదు జమ కానుంది.

thalliki vandanam AP Govt has announced good news regarding the Thalliki Vandanam scheme

ఆ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం

ఈనెల 22వ తేదీన గ్రామ, వార్డు కార్యాలయాలలో అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. తల్లికి వందనం పథకం నిధులను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలలో జమ చేస్తున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ స్కీమ్ ను వర్తింప చేసింది.

13 వేల రూపాయల నగదు జమ

వీరి అకౌంట్లలో 13 వేల రూపాయలు చొప్పున నగదు జమ చేయనున్నారు. అలాగే శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి తల్లికి వందనం అమలు ఉండేది కాదు అయితే తాజాగా తక్కువ జీతం వచ్చే అంగన్వాడీ వర్కర్లు శానిటేషన్ కార్మికుల తల్లికి వందనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రామీణ ప్రాంతాల అంగన్వాడి కార్యకర్తలకు పథకం వర్తింపు

గతంలో పట్టణ ప్రాంత అంగన్వాడీ వర్కర్లకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయగా, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల అంగన్వాడి కార్యకర్తలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తలకు వారి పిల్లలకు ఈ పథకం కింద సహాయం అందుతుందని మరేదైనా కారణాలతో తల్లుల ఖాతాలలో ఇప్పుడు డబ్బులు పడకపోతే, నెలాఖరు వరకైనా క్లియర్ చేయాలని మంత్రి లోకేష్ సూచించారు.

కార్యకర్తలు, శానిటేషన్ వర్కర్స్ కు సంతోషం

ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న తక్కువ వేతన జీవులకు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చెప్పింది నిజంగా శుభవార్తనే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అంగన్వాడి కార్యకర్తలు, శానిటేషన్ వర్కర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+