తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్.. ఆ విద్యార్ధులకు బ్యాంక్ అకౌంట్ మస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో అందిస్తున్న ఈ పథకంలో భాగంగా ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్ మరియు కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నారు.
ఎస్సీ విద్యార్థులకు కీలక అలెర్ట్
ఈ క్రమంలో ఈ నెలలో ప్రభుత్వం 2026- 27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు తల్లికి వందనం విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈనెల 16, 17, 18 తేదీలలో తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా మరో కీలకమైన అప్డేట్ ఇచ్చింది. తల్లికి వందనం పథకం కింద ఆర్థిక లబ్ధి పొందాలంటే ఎస్సీ విద్యార్థులకు కచ్చితంగా బ్యాంకు అకౌంటు ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్.. ఎన్పీసీఐ పోర్టల్ కు లింక్ చేస్తేనే డబ్బులు
2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందిన అర్హులైన ఎస్సీ విద్యార్థులు తమ పేరుతో బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్ తెరిచి దాన్ని ఎన్పీసీఐ పోర్టల్ కు లింక్ చేయాలని అధికారులు సూచించారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులు బ్యాంక్ అకౌంట్స్ తెరవ లేదని, ఈ ప్రక్రియను అందరూ పూర్తి చేయాలని సూచించారు.
18 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఇలా అకౌంట్
18 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పాన్ కార్డు లేకుండానే అకౌంట్ తెరవొచ్చని పేర్కొన్నారు. అయితే దీని కోసం కనీసం 200 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్, పదవ తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు, తల్లి లేదా తండ్రి బయోమెట్రిక్ ధ్రువీకరణ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబరు ఇచ్చి అకౌంటు తెరవాలని సూచిస్తున్నారు.
24 గంటల్లోనే npci కి లింక్ కావాలంటే ఇలా చెయ్యాలి
పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తెరిస్తే 24 గంటల్లోనే npci కి లింక్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకు అకౌంటు ఉన్నవారు npci మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఎటువంటి సమస్య ఎదురైనా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అని చెప్తున్న క్రమంలో విద్యార్థులు అకౌంట్స్ తీసుకోకపోతే తల్లికి వందనం పథకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
అకౌంట్ తెరిచిన వారు ఇది తప్పక చెక్ చేసుకోవాలి
ఇప్పుడు ఒకసారి అకౌంట్ తెరిస్తే ఇంటర్ సెకండియర్ లో కూడా వారికి ఎటువంటి సమస్య ఉండదు. బ్యాంక్ అకౌంట్ తెరిచిన వారు తప్పనిసరిగా NPCI పోర్టల్ కి లింక్ అయిందో లేదో కూడా సరి చూసుకోవాలి. అలా లింక్ కాకపోయినా తల్లికి వందనం పథకం నిధులు జమ కావు. ఇక ఈ విషయాన్ని ఎస్సీ విద్యార్థులు తప్పక గమనించాలని వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి npci అనుసంధానం చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.












Click it and Unblock the Notifications