విజయవాడ వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజ్, ఇళ్లకే మెకానిక్ లు.. దటీజ్ చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరదలకు విజయవాడ నగరంలోని అనేక కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. బుడమేరుకు గండ్లు పడడంతో విజయవాడ ను వరద ముంచేసింది. దీనితో ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పునరావస కేంద్రాలకు వెళ్లారు. ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయినవారు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.
వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు విజయవాడలో సాధారణ పరిస్థితులు తీసుకురావడం కోసం సీఎం చంద్రబాబు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
వరద బాధితులకు జరిగిన నష్ట పరిహారంపై చంద్రబాబు ఫోకస్
విజయవాడ కలెక్టరేట్లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు అందించాల్సిన సహాయాన్ని అధికారుల ద్వారా ప్రజల వద్దకు చేరుస్తూ కంటిమీద కునుకులేకుండా చంద్రబాబు నాయుడు చాలా కష్టపడ్డారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు విజయవాడ ప్రాంతంలోని ప్రజలు వరద ముంపు నుంచి బయటపడినప్పటికీ వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయటంపై చంద్రబాబు దృష్టి సారించారు.

మెకానిక్ లను రంగంలోకి దింపిన చంద్రబాబు
ఇక ఇళ్లల్లో విలువైన వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, బైకులు అన్ని నీట మునిగిపోవడంతో వస్తువులు పనిచేయక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ పరిస్థితులపై కూడా దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు బైక్ లు, ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్ లు ఇతర గృహపకరణాల విషయంలో మెకానిక్లను తీసుకువచ్చి బాగు చేయించి ఇచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పారు.
బైక్స్ రిపేర్ చేయిస్తున్న చంద్రబాబు
ఈ మేరకు వేరు వేరు ప్రాంతాల నుంచి మెకానిక్లను విజయవాడకు తీసుకువచ్చి వారి ద్వారా రిపేర్లు చేయిస్తున్నారు. ఆర్టీసీ, పోలీసు, అగ్నిమాపక, ఇతర ప్రభుత్వ విభాగాలలో పనిచేసే స్కిల్డ్ టెక్నీషియన్లను విజయవాడకు రప్పించిన సీఎం చంద్రబాబు, వీరితో పాటు ప్రముఖ బైక్ కంపెనీలకు సంబంధించిన మెకానిక్లను కూడా రంగంలోకి దించి వరద ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన బైక్లు రిపేర్ చేయిస్తున్నారు.
వరద బాధితులకు ప్యాకేజ్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు
ఇక టీవీలు, ఫ్రిజ్ ల విషయంలో కూడా రిపేరు చేయించగలుగుతామా లేక ఇన్సూరెన్స్ ఇప్పించటమా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంతే కాదు తాజాగా వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు 20 నుంచి 25 వేల రూపాయలు అందించాలని, ఓ మాదిరిగా నీట మునిగిన ఇళ్లకు 10000 ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
వరద బాధితులకు ఊరటనిచ్చేలా చంద్రబాబు ఆలోచన.. దటీజ్ చంద్రబాబు
మోటార్ సైకిల్ మరమ్మతులకు 3000 టాక్సీ లకు 10000 చొప్పున కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు వరద బాధితులకు ఇచ్చే ఆర్థిక సహాయం పైన ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఎలా సాధ్యమైతే అలా ప్రజా జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తుండడంతో దటీజ్ చంద్రబాబు అంటున్నారు ఆయన అభిమానులు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications