రెండో భార్యతో కాపురం చేస్తూ..!: చంద్రబాబుపై జగన్ ఘాటుగా, ఉట్టికొట్టిస్తూ...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వైయస్ హయాంలో వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం సహకార చక్కెర ఫ్యాక్టరీ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రూ.45వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందన్నారు.
నాలుగేళ్ల కాలంలో వేల కోట్ల నష్టాల్లోకి ఈ ఫ్యాక్టరీని తీసుకు వెళ్లారన్నారు. ఇక్కడ తయారీ చేసే మెలాసిన్ కేవలం ఆరువందలకు ప్రభుత్వం కొని వారి బినామీలకు రెండు వేలకు అమ్ముకుంటున్నారని, సీఎం స్థానంలో చంద్రబాబే అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. చంద్రబాబుహయాంలో వారి బంధువులకు, బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి దోచుకుంటున్నారన్నారు.

హుధుద్ గాయం మానలేదు
హుధుద్ తుఫాను గాయం ఇఫ్పటికీ మానలేదని జగన్ అన్నారు. గుంటూరులో ముస్లీంల సభ పెట్టి, అక్కడ ప్లకార్డులు పట్టుకున్న ముస్లీం యువకులను అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. వారిని చిత్రహింసలకు గురి చేశారన్నారు.

ఏ భార్యతో కాపురం చేస్తే ఆమె మంచిది అంటాడు
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏమన్నారంటే, జగన్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని విభజించిన రాహుల్ గాంధీకి ఓటు వేసినట్లే అన్నారని, ఇప్పుడు జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లని చెబుతున్నారని వైసీపీ అధినేత మండిపడ్డారు. చంద్రబాబు బీజేపీతో కాపురం చేస్తే బీజేపీ మంచిదని, కాంగ్రెస్‌తో కాపురం చేస్తే కాంగ్రెస్ మంచిదని అంటారని, చంద్రబాబు తీరు రెండో భార్యతో కాపురం చేస్తే రెండో భార్య మంచిదని చెబుతారని, మొదటి భార్యతో కాపురం చేస్తే మొదటి భార్య మంచిది అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఒక్క నిజం చెప్పనివాడు చంద్రబాబు
జీవితంలో ఒక్క అబద్దం చెప్పనివాడిని సత్యహరిశ్చంద్రుడు అని అంటామని, అలాగే ఒక్క నిజం చెప్పని వాడిని నారా చంద్రబాబు నాయుడు అంటామని జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాజకీయ పార్టీలు నిలబెట్టుకోవాలని, లేదంటే ఆ నాయకులు రాజీనామా చేసే పరిస్థితి రావాలని, అందుకే చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. చంద్రబాబు వంటి మోసాలు చేసే, అన్యాయం చేసే వ్యక్తిని క్షమిస్తే ఏం చేస్తారంటే.. 2014లో ఇచ్చిన 99 శాతం హామీలను నెరవేర్చానని చెబుతారని మండిపడ్డారు.

నోరా అబద్దాల ఫ్యాక్టరీయా
చంద్రబాబుది నోరా లేక అబద్దాల ఫ్యాక్టరీయా అని జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులను పెట్టించి, అనేకమందిని ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఆడవారు, ముస్లీంలు, ఎస్టీలు, ఎస్సీలపై కేసులు పెట్టించారన్నారు. తునిలో రైలును తగులబెట్టించింది చంద్రబాబే అన్నారు. వైయస్ హయాంలో సహకార రంగం లాభాల్లో ఉండేదని, ఇప్పుడు మాత్రం అలా లేదన్నారు. రైతు రుణమాపీ చేస్తామని చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తయ్యే అవకాశమే లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం పూర్తయితే రైవాడ నీరు స్థానిక రైతులకు ఇవ్వవచ్చునని చెప్పారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీపై 24వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారని తెలిపారు.
చిన్ని కృష్ణులతో జగన్
జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు. ఉట్టి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో జగన్ ఉట్టి కొట్టించారు. చిన్నారులతో సరదాగా గడిపారు. అంతకుముందు.. 'శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో మీ కోరికలన్నీ నెరవేరాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం మీకు, మీ ఆత్మీయులకు సుఖసంతోషాలను, సమృద్ధిని అందించాలి' శుభాకాంక్షలు తెలిపారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications