గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలా ఎదిగా... ఇళయరాజాకు ఏకలవ్య శిష్యుడిని: వర్థమాన సంగీత దర్శకుడు యాజమాన్య

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

తన సంగీత ప్రయాణాన్ని వివరించిన మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య

గుంటూరు:వర్థమాన సినీ సంగీత దర్శకుడు నయా మెలోడీ సాంగ్స్ సృష్టికర్త యాజమాన్య. పోటీ అత్యంత తీవ్రంగా ఉండే సినీ పరిశ్రమలోకి సంగీత దర్శకుడిగా ఆరంగ్రేటం ఇచ్చిన ఈ కొత్త కెరటం టాలీవుడ్ సంగీత సాగరంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగిపోతోంది. కీ బోర్డ్ ప్లేయర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి వందల సినిమాలకు పనిచేసిన ఈ యువ సంగీత సామ్రాట్ ఎటువంటి గాడ్ ఫాదర్ల అండ లేకుండానే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.

సంగీత దర్శకుడిగా మారిన అనతి కాలంలోనే పది సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ వహించిన ఈ టాలెంటెడ్ మ్యుజీషియన్ యాజమాన్య సంగీత దర్శకత్వం వహించిన ఐదు సినిమాలు కొద్దివారాల వ్యవధిలో విడుదల కానున్నాయంటేనే ఇతగాడి టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. తాజాగా పెదరావూరు ఫిలిమ్‌ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మించనున్న 'పండుగాడి ఫోటోస్టూడియో' సినిమా సంగీతం కోసమని తొలిసారిగా గుంటూరు జిల్లాకు విచ్చేశాడు. తాను ఇళయరాజకు ఏకలవ్య శిష్యుడినని ఏ భేషజాలు లేకుండా చెబుతున్న ఈ వర్థమాన సంగీత దర్శకుడు తన అంతరంగంలోని కొన్ని ఆలోచనలు మీడియా ముందు ఆవిష్కరించారు.

నో సినిమా బ్యాక్ గ్రౌండ్...కీ బోర్డ్ ప్లేయర్ గా

నో సినిమా బ్యాక్ గ్రౌండ్...కీ బోర్డ్ ప్లేయర్ గా

"మ్యూజిక్‌ మాస్త్రో ఇళయరాజాకు నేను ఏకలవ్య శిష్యుడు. ఆయన పాటతో అల్లుకున్న అనుబంధమే నా సంగీత ప్రపంచానికి నాంది" అని చెబుతున్న యాజమాన్య ఎలాంటి సినీ నేపధ్యం లేకుండానే తాను సినిమా రంగంలోకి కాలుమోపినట్లు తెలిపాడు. కీబోర్డు ప్లేయరుగా టాలీవుడ్ లో ఎంటరై వందలాది సినిమాలకు పనిచేసాడు. ఆ అనుభవానికి తనలో సహజ సిద్దంగా ఉన్న టాలెంట్ ను రంగరించి, కొద్ది కాలం వ్యవధిలోనే పదికి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం పొందాడు. అంతేకాదు మెలోడీ లవర్ గా తన సినిమాల్లో వినసొంపైన బాణీలను స్వరపరచి యువతరాన్ని మంత్రముగ్ధులను చేశాడు. టైటానిక్‌ సినిమాలో ‘పడిపోతున్నా నీ మాయలో', దళపతిలో శ్రేయోఘోషల్‌ పాడిన పాట ‘నీకూ నాకూ మధ్య ఏదో ఉంది', ‘రాజూ..దిల్‌రాజూ' పాటలతో యాజమాన్య యువతరంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు.

కొద్దికాలం వ్యవధిలోనే...విశేషమే

కొద్దికాలం వ్యవధిలోనే...విశేషమే

ఇతడు సంగీత దర్శకత్వం వహించిన ఐదు సినిమాలు త్వరలోనే కొద్దివారాల వ్యవధిలో వరుసగా విడుదల కానుండటం విశేషం. తాజాగా గుంటూరు జిల్లాలోని పెదరావురు వాస్తవ్యులు నెలకొల్పిన పెదరావూరు ఫిలిమ్‌ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘పండుగాడి ఫోటోస్టూడియో' అనే సినిమాకు సంగీతం సమకూర్చే పనిలో భాగంగా అదే పెదరావూరు విచ్చేశారు యాజమాన్య. తాను గుంటూరు జిల్లాకు రావడం ఇదే మొదటిసారని, అన్ని సినిమాలకు హైదరాబాద్ లో ఉండే సంగీతం సమకూర్చిన తాను తొలిసారిగా ఈ సినిమా కోసమని పెదరావూరు వచ్చినట్లు తెలిపారు.

బ్యాక్ గ్రౌండ్...వివరాలు ఇవీ

బ్యాక్ గ్రౌండ్...వివరాలు ఇవీ

నా స్వస్థలం చిత్తూరు జిల్లా పలమనేరు. మాది తెలుగు కుటుంబమే. నా పూర్తి పేరు యాజమాన్య వినోద్‌. "పండుగాడి ఫొటోస్టూడియో" నుంచి ఇక నా ఇంటి పేరే అసలు పేరుగా వాడాలని నిర్ణయించుకున్నా. నాకు గానీ మా ఫ్యామిలీకి గానీ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. అయితే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం...ఆ తరువాత విద్యార్థి దశలో ఆ పాటలంటే ఇష్టం కాస్తా పిచ్చిగా మారింది. ఇక ఇళయరాజా పాటలంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఆయన పాటల స్ఫూర్తితోనే సంగీతమే కెరీర్ గా తీసుకోవాలనే బీజం పడేందుకు కారణం అయింది. అదే గిటార్‌ పట్టుకునేలా చేసింది. ఆ తరువాత కీబోర్డు ప్లేయర్ గా మారాను. సొంతంగా ఎన్నో కచేరీలు చేశాను. ఆ తరువాత వచ్చిన గుర్తింపుతో వందేమాతరం శ్రీనివాస్‌ సంగీత బృందంలో చేరాను.

టాలీవుడ్ లో ఆరంగ్రేటం నుంచి...మ్యూజిక్ డైరెక్టర్ దాకా

టాలీవుడ్ లో ఆరంగ్రేటం నుంచి...మ్యూజిక్ డైరెక్టర్ దాకా

ఆ తరువాత తొలిసారిగా "జయం మనదేరా" తెలుగు సినిమా రికార్డింగ్‌ కోసం గిటారిస్ట్‌గా పనిచేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చా. ఆ తరువాత కొద్దిరోజుల వ్యవధిలోనే కీబోర్డు ప్లేయరుగా ఛాన్స్ వచ్చింది. అలా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 300 సినిమాలకు పైగా కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశాను. ప్రముఖ సంగీత దర్శకులు చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్‌ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ల దగ్గర పనిచేసే అవకాశం పొందాను. అలాంటి అవకాశం లభించడం నిజంగా నా అదృఫ్టం అనుకుంటున్నాను.

ఆ ఒక్క ఛాన్స్...ఫస్ట్ ఛాన్స్...2014లో

ఆ ఒక్క ఛాన్స్...ఫస్ట్ ఛాన్స్...2014లో

నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవాలని నిర్ణియంచుకున్నాక 2014 నుంచి సొంతంగా స్టూడియో ఏర్పాటుచేసుకొని పనిచేయడం మొదలు పెట్టాను. ఆ క్రమంలో అందరూ కొత్త వాల్లతో తీసిన ‘నువ్వే నా బంగారం' సినిమాకు పనిచేసే అవకాశం లభించింది. అదే నా మొదటి తెలుగు సినిమా. ఆ తరువాత ‘పోరా పోవే', ‘నాటుకోడి', ‘అనగనగా ఒక చిత్రమ్‌', ‘టైటానిక్‌' (అంతర్వేది టు అమలాపురం), ‘పెళ్లికి ముందు ప్రేమకథ', ‘రాక్షసి', ‘దళపతి', ‘అనగనగా ఒక ఊరిలో', ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో' సినిమాలకు సంగీత దర్శకత్వం వహించా. ఆ తరువాత మరో ఐదు సినిమాలు...పోసాని సినిమా ‘దేశముదుర్స్‌', ‘ప్రేమ ఎంత పనిచేసే నారాయణ', ‘తమిళ తంబి', ‘సమీరం', ‘బొమ్మ అదుర్స్‌' కు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశా...ఈ సినిమాలు మే/జూన్‌లో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలిపారు ఈ నయా ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య.

English summary
Vinod Yajamanya is an Tollywood film composer and singer, who primarily works as key board player for various language films. In 2014 he made his debut in the Telugu cine industry as music director. He has already directed ten movies for music and five other films will coming soon before the audience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X