దేశంలో జగన్ క్రేజ్ ను పెంచుతున్న ఆ చట్టం: ఏపీలో బాటలో మహారాష్ట్ర

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రేజ్ ను పెంచుతుంది ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం 2019. తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఏపీ సీఎం జగన్ ఇలాంటి ఘాతుకాలకు చెక్ పెట్టాలని ముందుగా స్పందించి దిశా చట్టాన్ని తెచ్చి మహిళా రక్షణకు భరోసా ఇచ్చారు. ఇక ఇప్పుడు ఇతర రాష్ట్రాలు సైతం ఏపీ బాటలో నడిచేలా దిశా యాక్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఏపీ బాటలో మహారాష్ట్ర

ఏపీ బాటలో మహారాష్ట్ర

ఏపీ సీఎం జగన్ మహిళల భద్రత కోసం తీసుకున్న నిర్ణయం ఏకంగా మరో రాష్ట్ర సీఎంనే ఫాలో అయ్యేలా చేసింది. ఇక ఏపీలో జగన్ పాలన చేపట్టి 9 నెలలే అయినా సీఎం జగన్ తన సంచలన నిర్ణయాలతో దేశం దృష్టిని ఆకర్షించారు . దేశం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంది. మహిళలపై అత్యాచారాలను నిరోధించే క్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా యాక్ట్‌ విషయంలో పలు రాష్ట్రాలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి.

Recommended Video

    Disha Act In Maharashtra : Anil Deshmukh Praises Disha Act And AP CM Jagan | Oneindia Telugu
    పార్లమెంట్ ఆమోదం పొందితే ఏపీలో అమలు కానున్న దిశా చట్టం

    పార్లమెంట్ ఆమోదం పొందితే ఏపీలో అమలు కానున్న దిశా చట్టం

    ఇక ఏపీలో ఇప్పటికే దిశా యాప్ అందుబాటులోకి తెచ్చి , దిశా పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసి దిశా కోర్టులను సైతం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ లో దిశా చట్ట బిల్లు ఆమోదం పొందింది అంటే ఏపీలో అమలు మొదలవుతుంది . ఇక ఈ యాక్ట్ ద్వారా అత్యాచార కేసుల్లో నిందితులకు 21 రోజుల్లోనే మరణ శిక్షలు విధించే విధంగా యాక్ట్ ను రూపొందించారు . ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా దిశ యాక్ట్‌ని తీసుకురావాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే దృష్టి సారించారు.

    మహారాష్ట్రలోనూ దిశా చట్టం తీసుకురావాలని భావిస్తున్న సీఎం

    మహారాష్ట్రలోనూ దిశా చట్టం తీసుకురావాలని భావిస్తున్న సీఎం

    ఇక ఏపీ సర్కార్ తీసుకు వచ్చిన దిశా యాక్ట్ ను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా అమలు చెయ్యటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని దేశ్ ముఖ్ గతంలో చెప్పారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించారు. మార్చి 30వ తేదీ లోపు నివేదిక అందజేయాలని సీఎం వారిని ఆదేశించినట్టు హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు.ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు పరిచేలా ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తుంది.

    9 నెలల పాలనలో దేశం దృష్టిని ఆకర్షించిన జగన్

    9 నెలల పాలనలో దేశం దృష్టిని ఆకర్షించిన జగన్

    ఏపీ సీఎం జగన్ పాలనాపగ్గాలు చేపట్టి 9 నెలలు మాత్రమే అయినా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశంలో చర్చనీయంశంగా మారుతున్నాయి . సీఎం జగన్ దిశా యాక్ట్ అమలు చెయ్యాలని దిశా చట్టాన్ని రూపొందించిన క్రమంలో పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో సైతం ఏపీలో తరహా చట్టాలను తీసుకురావాలని ఏపీని రోల్ మోడల్ గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+