శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి వార్షిక కుంభోత్సవం... విశేషాలివే!
శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా దేవి వార్షిక కుంభోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి దేవేరి భ్రమరాంబికా దేవి వార్షిక కుంభోత్సవం లో భాగంగా పూజలు అందుకుంటుంది . శ్రీశైలం మహా క్షేత్రంలో అమ్మవారికి ఏటా చైత్రమాసం కృష్ణపక్షంలో వార్షిక కుంభోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం లోకకళ్యాణార్థం అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
కుంభోత్సవంలో తొలివిడత సాత్విక బలి
ఈరోజు ఉదయం మొదటి విడత అమ్మవారి పూజలో భాగంగా సాత్విక బలిగా గుమ్మడికాయలు,నిమ్మకాయలు,కొబ్బరికాయలు సమర్పించారు . ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. శ్రీశైలంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరజల్లుతున్న శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ,జప పారాయణలను నిర్వహించారు.

ఏకాంతంగా పూజలు చేసిన అర్చకులు
ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్ని అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తరువాత అమ్మవారి ఆలయ ముందుభాగంలో రజకునిచేత ముగ్గు వేయించి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్వికబలిగా వందల సంఖ్యలో గుమ్మడి కాయలు,కొబ్బరికా యలను,నిమ్మకాయల సాత్విక బలిగా ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు,అర్చకులు భక్తులు సమర్పించారు.
మల్లికార్జునస్వామికి మహా మంగళ హారతి
సాయంకాలం మల్లికార్జునస్వామికి మహా మంగళ హారతిఅనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శొంటి, భక్షాలతో కప్పివేశారు. అలానే సాయంత్రం అమ్మవారికి ఆలయ ఆచారాల ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాశిగా పోసి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ చేస్తారు.
అమ్మవారికి కుంభహారతి
కుంభహారతిలో భ్రమరాంబ దేవికి పసుపు, కుంకుమలను సమర్పించి శాంతిప్రక్రియ నిర్వహిస్తారు. ప్రధానఘట్టం అయిన కుంభ హారతి అనంతరం మళ్ళీ రెండవ విడత సాత్విక బలిగా కొబ్బరి,గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే ఈ కుంభోత్సవం ప్రతి సంవత్సరం క్షేత్రరక్షణ కోసం నిర్వహిస్తారు.
ఆ సేవలు రద్దు.. ఆది దంపతుల రథోత్సవం
కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కల్యాణోత్సవం, ఏకాంత సేవలను రద్దు చేశారు.ఈరోజు సాయంత్రం ఆది దంపతులకు వెండి రథోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ రథోత్సవాన్ని తిలకించడం కోసం భారీగా భక్తులు తరలివస్తారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications