ముగిసిన పంచాయితీ.. ఏపీ భవనాలు తిరిగి తెలంగాణకు కేటాయింపు
రెండు తెలుగు రాష్ట్ర్ట్రాల మధ్య సమస్యలపై అటు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీలు సానుకూల చర్చలు జరుపుతుండడంతో సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నాయి. దీంతో రెండు రాష్ట్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలు ఒక్కోక్కటి పరిష్కారం అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఏపీకి కేటాయించిన తెలంగాణ భవనాలను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం పది సంవత్సరాల పాటు ఏపీకి తెలంగాణలోని పలు భవనాలను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అంధ్రప్రదేశ్ ఏర్పడిన కొద్ది రోజులకే పరిపాలన అంతా అమరావతి నుండే కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే అసెంబ్లీతోపాటు, సెక్రటేరియట్, పోలీసు శాఖకు కేటాయించిన భవనలు కూడ ఖాలీ ఉంటున్నాయి. అయితే ఏపికి కేటాయించిన భవనలు సరైన మెయింటెనెన్స్ లేక శిధిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే ఆ భవనాలను తమకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ఏపిని కోరింది. భవనాల కేటాయింపు పలుసార్లు రెండు రాష్ట్ర్రాల మంత్రులు కూడ చర్చించారు.

ఇక ఏపీలో జగన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో రెండు రాష్ట్ర్రాలు స్నేహభావంతో మెలుగుతున్న విషయం తెలిసిందే..దీంతో ఏపి భవనాల కేటాయింపుపై ఇటివల గవర్న్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గోనేందుకు వచ్చిన జగన్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. మరోవైపు గవర్నర్ సమక్షంలోనే ఈ చర్చలు జరగడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భవనాలను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించాడు. దీంతో గవర్నర్ నర్సింహన్ ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే పోలీసులకు తాత్కాలిక అవసరాలతోపాటు ఇతర కార్యాలయాల నిర్వహాణకు ఇతర భవనాలను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.
కాగా ఏపి భవనాలు తిరిగి తెలంగాణకు కేటాయించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.రెండు రాష్ట్ర్రాలు స్నేహభావంతో ముందుకు సాగడం మంచి పరిణామమని పేర్కోన్నారు. ఇలా రెండు ప్రభుత్వాలు ఒకరికోకరు సహకరించుకుని ముందుకు సాగాలన్నదే తన అకాంక్ష అన్నారు.












Click it and Unblock the Notifications