ఈ రోజు తిరుమలలో ప్రత్యేక ఏమిటో తెలుసా, వైభవంగా కార్తీకపౌర్ణమి గరుడసేవ, మోదీ కూడా అందుకే !
తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో ప్రతినెల పౌర్ణమి రోజు గరుడసే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి రోజు దేశ విదేశాల్లోని హిందువులు కార్తీక దీపాలు వెలిగించి దేవుడిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అలాంటి కార్తీక పౌర్ణమి రోజు తిరుమలలో వైభవగా కార్తీకపౌర్ణమి గరుడసేవ నిర్వహించారు.
తిరుమలలో సోమవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం తిలకిస్తే సర్వపాప ప్రాయశ్చిత్తం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో నిర్వహించే కార్తీకపౌర్ణమికి చాలా ప్రత్యేకతలతో పాటు ఎంతో చరిత్ర ఉంది.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

సోమవారం తిరుమలలో శ్రీవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజు భారత ప్రధాని తిరుమలకు రావడం ప్రధాన్యత సంతరించుకుంది. తిరుమలలో సోమవారం శ్రీవారి భక్తుల గరుడవాహనంపై విహరిస్తున్న శ్రీమలయప్పస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చేసినపాపాలు తొలగిపోవాలని స్వామివారిని వేడుకున్నారు.

ఆదివారం తిరుమలలో శ్రీవారిని 70, 350 మంది భక్తులు దర్శించుకున్నారు. 19, 500 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కలు తీర్చుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామికి వారికి హుండీలో రూ. 3. 11 కోట్లు సమర్పించుకున్నారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చాలా మంది వీఐపీలు, ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజు తిరుమల భక్తులతో కిటకిటలాడింది.












Click it and Unblock the Notifications