విజయవాడలో జనవరి 1 నుంచి పుస్తక మహోత్సవం
అమరావతి: పుస్తక ప్రియులకు శుభవార్త...జనవరి 1 నుంచి విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ బుక్ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నారు.
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఎన్‌టీఆర్ ట్రస్ట్, రాష్ట్ర సాంస్కృతిక శాఖలు ఈ ఏడాది ఈ పుస్తక మహోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించనున్నాయి. జనవరి ఒకటో తేదీన స్వరాజ్ మైదాన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పుస్తకమహోత్సవం ప్రారంభమవుతుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, సాహితీవేత్తలు, ప్రచురణకర్తలు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గోనున్నట్లు తెలిసింది. అయితే స్థలాభావం కారణంగా స్టాళ్ల సంఖ్యను గతంలో కంటే తగ్గించి 250కి పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం సాంస్కృతికశాఖ రూ.50 లక్షల నిధులను మంజూరు చేసింది. జనవరి 1 న ప్రారంభమయ్యే ఈ పుస్తక ప్రదర్శన జనవరి 11వ తేదీ వరకు కొనసాగుతుంది.













Click it and Unblock the Notifications