నరేంద్రమోడీ ప్రభుత్వ భారీ ప్రకటన.. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు?

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మూడో సాధి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీయే1, ఎన్డీయే2లో ప్రవేశపెట్టిన పథకాలను ఎన్డీయే3లో కూడా కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికీ దేశంలో చాలామంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండటంలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లాలనేది నరేంద్రమోడీ ఉద్దేశంగా ఉంది.

20 కోట్ల లబ్ధిదారులు
ప్రస్తుతం మోడీ సర్కార్ అందిస్తున్న ప్రమాద బీమా, లైఫ్ కవరేజ్ ను పెంచవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో కన్నా రెట్టింపు పెరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఈమేరకు కొన్ని నివేదికలు వివరాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ప్రస్తుతం రూ.2 లక్షల బీమా లభిస్తోంది. దాదాపు 20 కోట్లమంది ప్రజలు ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరారు. అతి పెద్ద జీవిత బీమా పథకంగా ఇది పేరు తెచ్చుకుంది.

The central government has increased the life accident insurance scheme to Rs 5 lakh

రూ.2 నుంచి రూ.5 లక్షలకు పెంపు?
ఇకనుంచి ఈ పథకం కింద అందే కవరేజ్ ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచబోతున్నట్లు కొన్ని సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతోపాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఇచ్చే కవరేజ్ ను కూడా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది. ఈ పథకంలో 45 కోట్లమంది లబ్ధిదారులు ఉన్నారు. కవరేజ్ పెంపుతో ప్రీమియం పెరుగుతుంది. ఏడాది ప్రీమియం కింద రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల బీమా వస్తుంది. ప్రమాదవశాత్తూ మృతిచెందితే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధమవుతోంది. అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు చెల్లిస్తారు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం కింద ఏడాదికి రూ.436 చెల్లిస్తే రూ.2 లక్షల కవరేజ్ వస్తుంది. 18 సంవత్సరాలు నిండినవారు దీనికి అర్హులు. వీరికి కూడా రూ.2 లక్షల బీమా డబ్బు వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+