తిరుపతిలో మఠం భూములు స్వాధీనం, పొక్లెయిన్లతో నేలమట్టం, ఏమైనా ఉంటే ?

ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో భూములకు ఎంత విలువ ఉందో అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుపతిలో ఇల్లు నిర్మించుకుని సెటిల్ కావాలి అంటూ కోట్లాది మంది ప్రజలకు ఆశపడుతుంటారు. అలాంటి తిరుపతి పరిసర ప్రాంత కోట్లాది రూపాయల విలువైన భూములు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి సిటీ, తిరుపతి గ్రామీణ, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల భూములు కబ్జా అయ్యాయని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి గ్రామీణ మండలంలోని వేదాంతపురం సమీపంలోని అవిలాల రెవెన్యూ పరిధిలో విద్యుత్ నగర్ వద్ద హథీరాంజీ మఠం భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

The concerned authorities have demolished the illegal structures in Hathiranji Mutt lands in Tirupati

హథీరాంజీ మఠం భూములలో అక్రమంగా కట్టడాలు నిర్మించారని ఆరోపించిన అధికారులు ఆ కట్టడాలను నేలమట్టం చేశారు. హథీమంఠం పరిపాలనాధికారి కేఎస్ రామారావు పొక్లెన్లు తీసుకెళ్లి మఠం భూముల్లోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. తిరుపతి ఏఎస్పీ రవి మనోహరాచారి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు హథీరాంజీ మఠం పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి శివ నాయక్, హరిప్రసాద్ నాయక్ లు కట్టడాలు కూల్చేస్తున్న అధికారులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ సందర్బంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సందర్భంలో తిరుపతి గ్రామీణ పోలీసులకు ఆందోళనకు దిగిన శివ నాయక్, హరిప్రసాద్ నాయక్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇవి మఠానికి చెందిన భూములు కాదని, మేము ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు కొనుగోలు చేశామని, దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని, కోర్టు తమకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని శివ నాయక్, హరిప్రసాద్ నాయకులు ఆరోపించారు.

అయితే మీ దగ్గర ఏవైనా పత్రాలు ఉంటే రెవెన్యూ శాఖ అధికారులకు చూపించి సమస్య పరిష్కరించుకోవాలని పోలీసులు శివనాయక్ కు సూచించారు. శివ నాయక్ అనే వ్యక్తి హథీరాంజీ మఠం పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి పలువురిని మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అర్జున్ దాస్ సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలను దృవీకరించారని,, ఆ తప్పుడు పత్రాలతో మఠం భూములు విక్రయించారని మఠం పరిపాలన అధికారి కేఎస్ రామారావు మీడియాకు చెప్పారు. తిరుపతి సమీపంలోనే హథీరాంజీ మఠం భూములను అధికారులు స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+